యాప్నగరం

కరోనా వైర‌స్‌పై క్రికెటర్ సరికొత్త పోరాటం

కరోనా వైరస్ (కోవిడ్-19)పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సెలబ్రిటీలు కృషి చేస్తున్నారు. తాజాగా క్రికెట‌ర్‌ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో చేసిన పని అందరినీ ఆకర్షిస్తోంది.

Samayam Telugu 24 Mar 2020, 4:19 pm
భారతదేశంలో కరోనా వైరస్ రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారికి 500 మందికి పైగా ప్రభావితులయ్యారు. దాదాపు 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచంలోని అన్ని క్రీడా రంగాల కుదేలయ్యాయి. అలాగే చాలామంది ప్లేయర్లు సోషల్ మీడియాలోకి వచ్చి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సోషల్ మీడియాలో స్పందించిన భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా అంద‌రినీ ఆక‌ర్శించాడు.
Samayam Telugu Visakhapatnam: Indias Ravichandran Ashwin holds the ball while leaving the grou...
India's Ravichandran Ashwin


Read Also: టీ20 ప్రపంచకప్ భవితవ్యంపై 29న నిర్ణయం



ట్విట్టర్లో తన అకౌంట్ పేరు మార్చిన అశ్విన్.. క‌రోనాపై ఒక సందేశాన్ని పోస్ట్ చేశాడు. ట్విట్టర్ తన పేరును లెట్ స్టే ఇన్‌డోర్స్ ఇండియా (దేశమంతా ఇంట్లోనే గడుపుదాం) గా అశ్విన్‌ మార్పు చేశాడు. అలాగే రాబోయే రెండు వారాల పాటు అంద‌రికీ కీలకమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. రాబోయే 14 రోజులు దేశంలోని ప్రతి ఊరు ఐసోలేటెడ్‌గా ఉండాలని పిలుపునిచ్చాడు. ఎంతో ముఖ్యమైన ఈ కాలంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించాడు.

Read Also: పాక్ క్రికెట్ బోర్డు నిద్రపోతోంది: కనేరియా

మరోవైపు కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పాటు వివిధ రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనతా క‌ర్ఫ్యూకు పిలుపు ఇవ్వగా.. గ‌త ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందరూ ఇళ‌ల్లోనే ఉండి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఇక తెలంగాణ సహా దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్ డౌన్‌ను పాటిస్తున్నాయి. ఈ వైరస్‌ని ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.