యాప్నగరం

వరల్డ్‌కప్‌ చాన్స్‌ మిగిలే ఉంది: వెట‌ర‌న్ క్రికెట‌ర్‌

క‌రోనా వైరస్ ముప్పు పొంచి ఉన్నప్పటికీ కూడా టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఐసీసీ తాజాగా స్పష్టం చేసింది. అక్టోబర్ 18 నుంచి ఈ టోర్నీ జరగనుంది.

Samayam Telugu 7 Apr 2020, 4:39 pm
ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనే టీమిండియాకు ఎంపికవుతానని భారత క్రికెటర్ రాబిన్ ఊత‌ప్ప‌ ధీమా వ్యక్తం చేశాడు. తనకు ఇంకా మెగా టోర్నీకి ఎంపికయ్యే అవకాశాలు మిగిలి ఉన్నాయని స్పష్టం చేశాడు. నిజానికి 2007 ఆరంభ ఎడిష‌న్ టీ20 ప్రపంచకప్‌లో ఊత‌ప్ప‌.. భారత్ త‌ర‌పున బరిలోకి దిగాడు. అనంతరం జాతీయ‌జ‌ట్టు త‌ర‌పున అవకాశాలు లభించినా, వాటిని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. క్ర‌మంగా జట్టు నుంచి దూరమయ్యాడు. 2011 నుంచి 8 వ‌న్డేలు, 4 టీ20ల్లో మాత్రమే తను ఆడాడు.
Samayam Telugu ICC T20 World Cup
ICC T20 World Cup


Read Also: కూతురుతో గల్లీ క్రికెట్ ఆడిన వెటరన్ ప్లేయర్

తన‌లో పొట్టి ఫార్మాట్‌ ప్రపంచ కప్‌లో ఆడే సత్తా ఉందని ఊత‌ప్ప‌ తెలిపాడు. టీమీండియాకు ఆడాలనే ఫైర్ తనలో అలాగే ఉందని, ఇప్ప‌టి నుంచి మరింత జట్టులో చోటు కోసం మరింత పోటీపడాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. మరోవైపు టీమిండియాకు టాపార్డ‌ర్‌, మిడిలార్డ‌ర్‌లలో ఆడటంతోపాటు ఫినిష‌ర్ పాత్ర పోషించే స‌త్తా ఉందని పేర్కొన్నాడు. అయితే టీమిండియాను ఎంపిక కావాలంటే అదృష్టంతో పాటు అనేక విషయాలు కలిసి రావాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు.

Read Also: కోహ్లీకి కోపం తెప్పిస్తే.. ఐపీఎల్ నుంచి ఔట్

నిజానికి 2006లో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన ఊత‌ప్ప‌.. ఇండియా త‌ర‌పున 46 వ‌న్డేలు 13 టీ20లు ఆడాడు. ఐదేళ్ల కిందట భారత జాతీయ జట్టు త‌ర‌పున ,చివరిసారిగా బ‌రిలోకి దిగాడు. మరోవైపు టీ20 ప్రపంచకప్ మ‌రోసారి గెలవాలని భారత్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. 2007 ప్రపంచకప్ గెలిచిన తర్వాత 2010లో ఫైనల్‌కు చేరి ర‌న్న‌ర‌ప్‌గా భార‌త్ నిలిచింది. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ తుదిపోరుకు అర్హ‌త సాధించ‌లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.