యాప్నగరం

ఐసీసీకి ఝ‌ల‌క్ ఇచ్చిన రోహిత్ శర్మ

ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో భారత వైట్‌బాల్‌ క్రికెట్ వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది వ‌న్డే వరల్డ్‌క‌ప్ ఐదు సెంచరీలతో వరల్డ్ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 22 Mar 2020, 10:07 pm
భారత వైట్ బాల్ క్రికెట్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై పంచ్‌ వేశాడు. కరోనా వైరస్ కారణంగా దాదాపు మెజారిటీ ఆఫీసులు మూతపడగా ఉద్యోగులంతా.. ప్ర‌స్తుతం ఇంటి నుంచి పని (వ‌ర్క్ ఫ్రం హోమ్‌) చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ సోషల్ మీడియాలో నలుగురు క్రికెటర్ల‌తో కూడిన ఒక ఫోటో కాలేజ్‌ను పోస్టు చేసి, ఒక ప్రశ్న అడిగింది. ఆ నలుగురిని ఉద్దేశించి ఇందులో అత్యుత్తమ ఫుల్ షాట్ ఆడే క్రికెటర్ ఎవరు అని ప్రశ్నించింది. ఈక్ర‌మంలో లైన్ లోకి వచ్చిన రోహిత్ శర్మ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు.
Samayam Telugu Thiruvananthapuram: Indian opener Rohit Sharma plays a shot during the second T2...
Indian opener Rohit Sharma


Read Also: ఐపీఎల్‌: టాప్‌-8 స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్లు



ఇంతకీ ఐసీసీ.. సోషల్ మీడియాలో ఏమని పోస్ట్ చేసిందంటే... రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్‌), విరాట్ కోహ్లీ (ఇండియా), హెర్ష‌ల్ గిబ్స్ (ద‌క్షిణాఫ్రికా)ల‌తో కూడిన ఫోటోను పోస్ట్ చేసింది. పై ప్రశ్న సంధించి, దీనికి సమాధానం ఇవ్వాలని కోరింది. అప్పటికే కొంత మంది నెటిజన్లు ఇందులో రోహిత్‌ పేరును ఎందుకు యాడ్ చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాసేపటికే లైన్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ విభిన్నంగా స్పందించాడు. ఈ ఫోటోలో ఒక వ్యక్తి మిస్సయ్యాడని, వర్క్ ఫ్రం హోమ్ ప‌ని చేయడం అంత ఈజీ కాదని చమత్కరించాడు. అంటే పరోక్షంగా తనను ఈ లిస్టులో ఎందుకు చేర్చలేదని ఐసిసి ఝ‌ల‌క్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఐసీసీ నుంచి ఏమి సమాధానం రాలేదు.

Read Also: న‌మ్మండి..వీళ్లంతా ఐపీఎల్ చాంపియ‌న్లే!

ఇక 2013లో భారత ఓపెనర్‌గా మారక‌ రోహిత్ శర్మ వెనుదిరిగి చూసుకోలేదు. చాంపియన్స్ ట్రోఫీలో అప్పటి భారత కెప్టెన్ ఎంఎస్ ధోని.. హిట్‌మ్యాన్‌ను ఓపెనర్‌గా ప్ర‌మోష‌న్ ఇచ్చాడు. ఇక గతేడాది టెస్టుల్లోనూ ఓపెనర్ గా ప్రమోషన్ పొందిన రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మరోవైపు కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడిన సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మక ఐపీఎల్‌ను ఈ నెల 29 నుంచి వచ్చే నెల 15కు బీసీసీఐ వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.