యాప్నగరం

IND vs AUS: భారత క్రికెటర్లకు 20 శాతం జరిమానా.. ఐసీసీ ప్రకటన

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఓడిన భాధలో ఉన్న భారత క్రికెటర్లకు ఐసీసీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో 20 శాతం కోత విధించింది.

Samayam Telugu 28 Nov 2020, 2:41 pm
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. మ్యాచ్ ఫీజులో కోత విధించాలని రిఫరీ డేవిడ్ బూన్ నిర్ణయించారు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం ఫెనాల్టీని అంగీకరించాడు. దీంతో ఈ విషయంలో వాదోపవాదనల అవసరం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేయగా.. బదులుగా భారత్ 8 వికెట్ల నష్టానికి 308 రన్స్ మాత్రమే చేసింది.
Samayam Telugu team india
Image: twitter


ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ జట్టయినా.. 210 నిమిషాల్లో 50 ఓవర్ల కోటా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే మాత్రం పెనాల్టీ విధిస్తారు. సిడ్నీ వన్డేలో వెసులుబాటు కల్పించిన సమయం ముగిసిన తర్వాత భారత్ ఒక ఓవర్ వేసినట్లు ఐసీసీ వెల్లడించింది. కాగా 50 ఓవర్లు వేయడానికి భారత్ 246 నిమిషాలు తీసుకుందని సమాచారం.

ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఆటగాళ్లకు ఈ జరిమానా విధించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ఆదివారం సిడ్నీ వేదికగా జరగనుంది.

కొత్తగా ప్రవేశపెట్టిన ఐసీసీ వరల్డ్ కప్ సూపర్ లీగ్ నిబంధనల ప్రకారం.. స్లో ఓవర్‌ రేట్‌తో బౌలింగ్ చేసిన జట్టు ఒక ఛాంపియన్‌షిప్ పాయింట్‌ను కోల్పోతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.