యాప్నగరం

కరోనా సంక్షోభాన్ని త్వ‌ర‌లోనే అధిగమిస్తాం: మాజీ క్రికెట‌ర్‌

క‌రోనా వైరస్ సంక్షోభాన్ని త్వరలోనే అధిగమిస్తామని భారత మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటికే మనం వైపరిత్యాలపై పోరాటం చేశామని గుర్తు చేశాడు.

Samayam Telugu 29 Mar 2020, 3:29 pm
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తున్న‌ సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు లక్షలమందికి పైగా క‌రోనా పాజిటివ్‌గా తేలారు. మరో 22 వేల మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఈ వ్యాధికి వ్యాక్సిన్ క‌నుక్కోలేదు. అలాగే మందులు క‌నిపెట్టే ప్ర‌య‌త్నంలో శాస్త్రవేత్తలు ఉన్నారు. మరోవైపు క‌రోనా సంక్షోభాన్ని త్వరలోనే అధిగమిస్తామని భారత మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ ఆశాభావం వ్య‌క్తం చేశాడు. గతంలో ఎన్నో సవాళ్లను అధిగమించిన‌ మన పూర్వీకులు, అనేక వ్యాధుల నుంచి పోరాడార‌ని బాలాజీ గుర్తు చేశాడు. అలాగే ఇటీవల 2004 సునామీతోపాటు చెన్నై వ‌ర‌ద‌ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నాడు.
Samayam Telugu Lakshmipathy Balaji
Lakshmipathy Balaji


Read Also: రాహుల్ టెస్టుల్లోకి రీఎంట్రీ ఇస్తాడు: వ‌సీం జాఫ‌ర్‌

క‌రోనా వైరస్ విస్త‌రిస్తున్న‌వేళ ప్రజలందరూ తగిన సురక్షిత చర్యలు పాటించాల్సిన‌ అవసరం ఉందని బాలాజీ అన్నాడు. అత్యవసరమైతే తప్ప బ‌య‌ట‌కు వెళ్లాల‌ని, లేక‌పోతే జ‌నం అంతా ఇంట్లోనే ఉండాలని సూచించాడు. ఇలాంటి సంక్షోభ పరిస్థితులు ఎదురైవేళ ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నాడు. విభేదాలను పక్కనపెట్టి అన్ని దేశాలు, పరస్పరం సహాయం చేసుకుంటున్నాయ‌ని తెలిపాడు.

Read Also: టీమిండియా క్రికెటర్‌కి హీరోగా మారిన అక్షయ్

2002లో భారత జట్టులోకి అరంగ్రేటం చేసిన బాలాజీ.. అన్ని ఫార్మాట్లలో కలిపి 71 వికెట్లు తీశాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వివిధ జ‌ట్ల‌ తరఫున ఆడాడు. కోల్‌క‌తా నైట్‌రైడర్స్, చెన్నైసూపర్‌కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. ఓవరాల్ గా 73 మ్యాచ్‌ల్లో బ‌రిలోకి దిగిన బాలాజీ.. 76 వికెట్లతో సత్తా చాటాడు. క‌రోనాను ఎదుర్కొనే చ‌ర్య‌ల్లో భాగంగా ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా వచ్చే నెల 14 వరకు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.