యాప్నగరం

కరోనా ఫైట్.. 4 వేల మందికి సచిన్ సాయం

క‌రోనా వైర‌స్ లాంటి విప‌త్క‌ర ప‌రిస్థ‌తి ఎదురైనవేళ త‌మ‌కు తోచిన విధంగా సాయం చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీంతో ఇప్ప‌టికే చాలామంది వివిధ ర‌కాలుగా సాయం చేసేందుకు ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

Samayam Telugu 9 May 2020, 3:29 pm
ప్రమాదకర కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు పొడ‌గించ‌డంతో ఈనెల 17 వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌నుంది. అయితే దేశవ్యాప్తంగా నిరుపేద‌లు, వ‌ల‌స కూలీలు తిన‌డాన‌కి తిండి దొర‌క్క‌, చేయ‌డానికి ప‌ని లేక ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు. తాజాగా భారత లెజెండ‌రీ ప్లేయ‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్.. ముంబైలోని నాలుగు వేల మంది నిరుపేదలకు సాయం చేశాడు.
Samayam Telugu Sachin Tendulkar
Sachin Tendulkar poses with the 'Best Sporting Moment Award' during the 2020 Laureus World Sports Awards in Berlin, Germany.AP/PTI(


Must Read: న్యూ లుక్‌లో ఎంఎస్ ధోనీ.. ఫ్యాన్స్ ఫిదా
నిరుపేదలు, వలస కూలీలకు సాయం అందించాల‌ని హైఫైవ్ యూత్ ఫౌండేష‌న్ అనే స్వ‌చ్ఛంద సంస్థ‌కు స‌చిన్ నిధులిచ్చాడు. దీంతో నిరుపేద‌ల‌తోపాటు బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో చ‌దువుకుంటున్న విద్యార్థుల‌కు కూడా సాయం చేసిన‌ట్లు స‌ద‌రు సంస్థ ట్వీట్ చేసింది. దీనికి స‌మాధాన‌మిచ్చిన స‌చిన్‌.. కరోనా వేళ నిరుపేద‌ల‌ను సంస్థ ఆదుకోవడంపై కితాబిచ్చాడు.

Must Read: ఆస్ట్రేలియా‌ని చితక్కొట్టిన మ్యాచ్‌.. కోహ్లీకి ఫేవరెట్

గ‌త‌నెల‌లో ఐదువేల‌మంది నిరుపేద‌ల‌కు సాయం చేసేందుకుగాను ఆప్నాల‌యా అనే స్వ‌చ్ఛంద సంస్థ‌కు సచిన్ నిధులిచ్చాడు. అలాగే క‌రోనా వేళ పీఎం కేర్స్‌తోపాటు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 25 ల‌క్ష‌ల చొప్పున మాస్ట‌ర్ బ్లాస్ట‌‌ర్ సాయం చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌న‌దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 59,800కిపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 1980కిపైగా మ‌ర‌ణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.