యాప్నగరం

టెస్టుల్లో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ తీసిన ఏకైక పేసర్ ఇర్ఫాన్

భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం వీడ్కోలు పలికాడు. పాక్‌పై హ్యాట్రిక్, టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు తదితర ఘనతలు సాధించాడు.

Samayam Telugu 4 Jan 2020, 5:32 pm
భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. 2012లో చివరిసారిగా భారత్ తరపున ఆడిన పఠాన్.. దేశవాళీల్లోనూ గతేడాదే చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి తన సొంతజట్టు బరోడాకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్‌ తరపున తొమ్మిదేళ్లపాటు ఇర్ఫాన్ ప్రాతినిథ్యం వహించాడు.
Samayam Telugu irfan pathan 3


Read Also : కూతురు జీవాతో ధోనీ.. మంచులో ఆటలు (వీడియో)
ఇర్ఫాన్ పఠాన్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పాకిస్థాన్‌పై టెస్టులలో హ్యాట్రిక్ తీసిన వైనమే. 2006లో పాక్ గడ్డపై టెస్టు మ్యాచ్ తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ తీశాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే భారత్ 2007 టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫైనల్లో 16 పరుగులిచ్చి కీలక మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో ఆడిన తొలిసారే కప్పు భారత్ వశమైంది.

Read Also : Virat Kohli : ఆ మార్పులతో రేపటి రోజుల్లో టెస్టు క్రికెటే ఉండదు
2003లో అరంగేట్రం చేసిన పఠాన్ తన కెరీర్‌లో 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 301 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్‌లోనూ ఫర్వాలేదనిపించాడు. గ్రెగ్ చాపెల్ హయాంలో తనను పించ్ హిట్టర్‌గా బరిలోకి దింపి ప్రయోగాలు చేసిన సంగతి తెలిసిందే. నికార్సైన స్వింగ్ బౌలింగ్‌కు పెట్టింది పేరయిన ఇర్ఫాన్.. టెస్టుల్లో 1105 పరుగులు, వన్డేల్లో 1544 రన్స్ సాధించాడు. రిటైర్మెంట్ అనంతరం యువరాజ్ సింగ్‌‌లాగా విదేశీ లీగ్‌ల్లో ఆడే అవకాశముంది.

Read Also : jasprit bumrah: కెప్టెన్‌గా కోహ్లీ, ధోనీలో ఎవరు మెరుగంటే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.