యాప్నగరం

కుల్దీప్‌పై అంచనాలున్నాయి.. వదిలేయం..!

చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై భారీ అంచలున్నాయని.. అతడ్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని టీమిండియా

TNN 15 Aug 2017, 7:26 pm
చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై భారీ అంచలున్నాయని.. అతడ్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. శ్రీలంకతో ముగిసిన పల్లెకలె టెస్టులో కుల్దీప్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఐదు వికెట్లు తీసి భారత్ విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 2019 ప్రపంచకప్‌ కోసం ఈ ఉత్తరప్రదేశ్ స్పిన్నర్‌ సిద్ధమయ్యేలా.. అన్ని ఫార్మాట్లలో తగినన్ని అవకాశాలు ఇవ్వనున్నట్లు ఎమ్మెస్కే స్పష్టం చేశారు.
Samayam Telugu indian team management has long term plans with kuldeep yadav
కుల్దీప్‌పై అంచనాలున్నాయి.. వదిలేయం..!


‘జట్టు ఎంపికలో సెలక్టర్లుగా మాకు స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలున్నాయి. త్వరలోనే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సిరీస్‌ల్లో కుల్దీప్‌కి ఎక్కువ అవకాశాలిస్తాం. ఎందుకంటే మా ప్లాన్ 2019 ప్రపంచకప్‌కి జట్టుని సిద్ధం చేయడమే. టీ20, వన్డేల్లో అవకాశం ఇవ్వడం ద్వారా ప్రతిభని వెలుగులోకి తీయడం వెస్టిండీస్ పర్యటనతోనే ఆరంభించాం’ అని ఎమ్మెస్కే వివరించారు. ఆగస్టు 20 నుంచి శ్రీలంకతో భారత్ ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.