యాప్నగరం

ధోనీ స్థానంలో కీపింగ్ అంత ఈజీ కాదు: కేఎల్ రాహుల్

ధోనీ తరహాలో వికెట్ల వెనుక మెరుపు వేగంతో స్పందించే కేఎల్ రాహుల్.. బ్యాట్స్‌మెన్‌గానూ టీమ్‌లో ఫినిషర్‌ రోల్‌ని పోషిస్తున్నాడు. దీంతో.. ధోనీతో అతడ్ని అందరూ పోలుస్తున్నారు. కానీ..?

Samayam Telugu 27 Apr 2020, 7:40 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్థానాన్ని జట్టులో భర్తీ చేయడం అంత సులువుకాదని వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ అంగీకరించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత టీమిండియాకి ధోనీ దూరమవగా.. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశమిచ్చారు. కానీ.. పంత్ విఫలమవగా.. కేఎల్ రాహుల్ మాత్రం వన్డే, టీ20ల్లో నిలకడగా రాణించి జట్టు ఫస్ట్ ఛాయిస్ కీపర్‌గా మారిపోయాడు. దీంతో.. ధోనీ స్థానాన్ని రాహుల్ చక్కగా భర్తీ చేస్తాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Samayam Telugu KL Rahul VS NZ WIK


Read More: యువీ.. సరిలేరు నీకెవ్వరు.. ఆ రికార్డుకు తిరుగులేదు
ధోనీతో పోలికపై కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ‘‘క్రికెట్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్లకి నేను సుదీర్ఘకాలంగా కీపింగ్ చేస్తున్నాననే విషయం బాగా తెలుసు. ఐపీఎల్‌లోనే కాదు.. దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక తరఫున నేను కీపింగ్ చేస్తుంటాను. కాబట్టి.. టీమిండియా మేనేజ్‌మెంట్ కీపింగ్ బాధ్యతలు తీసుకోమని కోరగానే పూర్తి ఆత్మవిశ్వాసంతో అంగీకరించాను. కానీ.. టీమిండియాకి కీపింగ్ చేసేటప్పుడు కాస్త ఆందోళనగా అనిపిస్తోంది. ఎందుకంటే.. మ్యాచ్ సమయంలో అభిమానులు నా కీపింగ్‌ని ధోనీ ప్రదర్శనతో పోల్చి చూస్తున్నారు. అయితే.. దిగ్గజ క్రికెటరైన ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు. అభిమానులు కూడా అంత సులువుగా ఎవరినీ అంగీకరించరు కూడా’’ అని చెప్పుకొచ్చాడు.

Read More: ధోనీలా ఎవరూ ఆలోచించలేరంతే..!: ఆర్పీ సింగ్

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఈ టోర్నీకి కేఎల్ రాహుల్‌ని ఫస్ట్ ఛాయిస్ కీపర్‌గా ఎంపిక చేయాలనే డిమాండ్స్ ఇప్పటి నుంచే వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ నిరవధికంగా వాయిదాపడటంతో.. ధోనీ రీఎంట్రీ మరింత సందిగ్ధదంలో పడిపోయింది. దీంతో.. సెకండ్ వికెట్ కీపర్ రేసులో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, సంజు శాంసన్ తదితరులు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.