యాప్నగరం

టెస్టు క్రికెట్‌పై శ్రేయాస్ కన్ను.. చెక్ ఎవరికి..?

వన్డే, టీ20ల్లో నెం.4 స్థానంలో ఆడుతూ ఇప్పటికే సురేశ్ రైనా, అజింక్య రహానె రీఎంట్రీకి చెక్ చెప్పేసిన శ్రేయాస్ అయ్యర్.. ఇప్పుడు టెస్టుల్లో నెం. 5 స్థానంపై కన్నేశాడు. శ్రేయాస్ టెస్టుల్లో ఆడితే.. తెలుగు క్రికెటర్‌కి పోటీ ఏర్పడనుంది.

Samayam Telugu 26 Mar 2020, 10:33 am
భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ టెస్టు క్రికెట్‌పై కన్నేశాడు. ఇప్పటికే టీ20, వన్డేల్లో సుస్థిర స్థానం దక్కించుకున్న ఈ యువ క్రికెటర్.. త్వరలోనే టెస్టు ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీమిండియాని సుదీర్ఘకాలం వేధించిన నెం.4 సమస్యని శ్రేయాస్ కేవలం మూడు నెలల్లోనే తీర్చేశాడు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా.. భాగస్వామ్యాల్ని నిర్మించడంతో పాటు స్లాగ్ ఓవర్లలో హిట్టింగ్‌ చేయగల సామర్థ్యం అతని సొంతం.
Samayam Telugu Bengaluru: Indian cricket team player Shreyas Iyer during a practice session ahe...


Read More: రోహిత్ శర్మతో ఈరోజు పీటర్సన్ ఇంటర్వ్యూ

కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పటికే క్రికెట్ టోర్నీలన్నీ రద్దవగా.. ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్న శ్రేయాస్ అయ్యర్ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటున్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని టెస్టుల్లో అరంగేట్రంపై అడిగిన ప్రశ్నకి శ్రేయాస్ ధీమాగా సమాధానమిచ్చాడు. ‘‘క్రికెట్‌లో టెస్టు ఫార్మాట్ అత్యుత్తమం. ప్రతి క్రికెటర్‌కి టెస్టులు ఆడాలనేది ఓ కల. నేను కూడా టీమిండియా తరఫున టెస్టుల్లో ఆడేందుకు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’’ అని శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు.

Read More: ధోనీ కూల్, కామ్.. నిజమైన లీడర్: శ్రేయాస్

టీమిండియాకి యువరాజ్ సింగ్, సురేశ్ రైనా దూరమైన తర్వాత నెం.4 స్థానంలో నిలకడగా ఆడే బ్యాట్స్‌మెన్ కోసం మూడేళ్ల పాటు అన్వేషించారు. ఎట్టకేలకి నిరీక్షణకి తెరదించుతూ గత ఏడాది ఆఖర్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు బాదిన శ్రేయాస్ అయ్యర్.. ఆ స్థానానికి తాను తగిన క్రికెటర్‌గా నిరూపించుకున్నాడు. అయితే.. ఇప్పుడు టెస్టుల్లోకి శ్రేయాస్ వస్తే..? తెలుగు క్రికెటర్ హనుమ విహారిపై వేటు పడే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.