యాప్నగరం

తొలి టీ20లో భారత్ తుది జట్టు‌పై ఉత్కంఠ

గాయపడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న పవర్ హిట్టర్ శివమ్ దూబే‌కి ఈరోజు అరంగేట్రం అవకాశం దక్కుతుందా..? రిషబ్ పంత్‌ని ఏ స్థానంలో ఆడిస్తారు..?

Samayam Telugu 3 Nov 2019, 3:19 pm
బంగ్లాదేశ్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు రాత్రి జరగనున్న తొలి టీ20లో భారత్ తుది జట్టుపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో జట్టులో ప్రయోగాలు చేసి.. మెరుగైన జట్టుని సిద్ధం చేసుకోవాలని సెలక్టర్లు యోచిస్తున్నారు. దీంతో.. బంగ్లాదేశ్‌తో ఈరోజు నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్ కోసం సీనియర్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాకి విశ్రాంతినిచ్చి మరీ కుర్రాళ్లకి అవకాశం కల్పించారు. అయితే.. తుది జట్టు ఎలా ఉండబోతోంది..? అనేదానిపై మాత్రం పూర్తి స్పష్టత రావడం లేదు.
Samayam Telugu indias predicted playing xi for first t20i against bangladesh
తొలి టీ20లో భారత్ తుది జట్టు‌పై ఉత్కంఠ


Read More: undefined

భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, సంజుశాంసన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కృనాల్‌ పాండ్య, చాహల్, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, శార్ధూల్ ఠాకూర్

Read More: undefined
ఈరోజు తొలి టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు ఓపెనర్లుగా ఆడనుండగా.. మూడో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక నాలుగో స్థానంలో శ్రేయాస్‌ని ఆడించాలా లేదా సంజు శాంసన్, రిషబ్ పంత్‌లో ఎవరిని ఆడించాలి అనేదానిపై టీమిండియా మేనేజ్‌మెంట్ సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆరు‌లో మాత్రం పవర్ హిట్టర్ శివమ్ దూబే దాదాపు ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. పేసర్లు దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్‌‌తో పాటు చాహల్, కృనాల్‌ పాండ్య, సుందర్‌లు తుది జట్టులో ఉంటారని తెలుస్తోంది.

Read More: undefined
భారత్ తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, సంజు శాంసన్, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్/ శార్ధూల్ ఠాకూర్, దీపక్ చాహర్, చాహల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.