యాప్నగరం

పుజారా సెంచరీ.. కివీస్ లక్ష్యం 475 పరుగులు

ఇండోర్ టెస్టులో భారత జట్టు న్యూజిలాండ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో పుజారా సెంచరీ చేశాక 216/3 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

TNN 11 Oct 2016, 1:34 pm
ఇండోర్ టెస్టులో భారత జట్టు న్యూజిలాండ్‌కు 475 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 216/3 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఛటేశ్వర పుజారా(101 నాటౌట్) సెంచరీ సాధించాడు. 97 పరుగుల వద్ద నీషామ్ బౌలింగ్‌లో బౌండరీ సాధించిన పుజారా ఈ సిరీస్‌లో తొలిసారిగా సెంచరీ సాధించాడు. టెస్టుల్లో అతడికిది 8వ సెంచరీ కావడం విశేషం. గత రెండు టెస్టుల్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించిన అతడు వాటిని శతకాలుగా మలచడంలో విఫలం కాగా, ఈసారి మాత్రం పట్టుదలతో ఆడి సెంచరీ చేశాడు. భారత్ డిక్లేర్ చేసే సమయానికి మరో ఎండ్‌లో అజింక్య రహానే 23 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
Samayam Telugu indvsnz pujara century newzealand target 475 runs
పుజారా సెంచరీ.. కివీస్ లక్ష్యం 475 పరుగులు

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 557 పరుగులు చేయగా, కివీస్ 299 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. గత రెండు టెస్టుల్లో ఒక సెంచరీ కూడా నమోదు కాకపోగా, ఈ మ్యాచ్‌లో ఒక డబుల్ సెంచరీ సహా రెండు శతకాలు నమోదు కావడం విశేషం. రెండేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన గంభీర్ రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడి.. అర్ధ సెంచరీ సాధించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.