యాప్నగరం

కార్తీక్ అవకాశాన్ని దెబ్బతీసిన గాయం

దినేశ్ కార్తీక్ గాయం పార్థివ్ పటేల్‌కి కలిసొచ్చింది.

TNN 25 Nov 2016, 12:17 pm
దినేశ్ కార్తీక్ గాయం పార్థివ్ పటేల్‌కి కలిసొచ్చింది. ప్రస్తుతం తమిళనాడుకు ఆడుతున్నవికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ చేతి వేలి గాయం కావడంతో బీసీసీఐ పార్థివ్ పటేల్‌ను ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్టుకు ఎంపిక చేసింది. దీంతో ఎనిమిదేళ్ల తరవాత మళ్లీ అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లో పార్థివ్ ఆడబోతున్నాడు.
Samayam Telugu injury came at wrong time karthik
కార్తీక్ అవకాశాన్ని దెబ్బతీసిన గాయం


అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వస్తాననే నమ్మకం తనకు ఉందని 2016-17 రంజీ ట్రోఫీ సీజన్ ప్రారంభంలో కార్తీక్ చెప్పాడు. అతని ఫాం కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. కార్తీక్ ఈ సీజన్‌లో వరసగా 163, 73, 95, 65, 80, 54 స్కోర్లు సాధించాడు. అయితే గత నెల తమిళనాడు, మధ్యప్రదేశ్‌ జట్ల మధ్య కటక్‌లో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ ఆడినప్పటికీ చేతి వేలి గాయం కారణంగా కీపింగ్ మాత్రం చేయలేదు. కానీ చేతి వేలి గాయంతోనే కార్తీక్ నాలుగు అర్థ సెంచరీలు సాధించడం విశేషం.

వృద్ధిమాన్ సాహా గాయపడటంతో ప్రస్తుతం భారత జట్టుకు కీపర్ అవసరం. అందుకనే బ్యాటింగ్‌లో రాణిస్తున్నప్పటికీ కీపింగ్ చేయలేకపోవడం వల్ల కార్తీక్‌ని కాదని 31 ఏళ్ల పార్థివ్ పటేల్‌కు అవకాశం ఇచ్చినట్లు కోచ్ అనిల్ కుంబ్లే వెల్లడించాడు. దీనిపై స్పందించిన కార్తీక్ గాయం తన అవకాశాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ సమయంలో గాయం కావాల్సింది కాదని అన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.