యాప్నగరం

ఐపీఎల్ 2017 వేలం: రేసులో 351 ప్లేయర్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2017 సీజన్ కోసం నిర్వహించే వేలంలో మొత్తం 351 మంది ఆటగాళ్లు పాల్గొంటారని నిర్వాహకులు ప్రకటించారు.

TNN 14 Feb 2017, 6:21 pm
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2017 సీజన్ కోసం నిర్వహించే వేలంలో మొత్తం 351 మంది ఆటగాళ్లు పాల్గొంటారని నిర్వాహకులు ప్రకటించారు. మొత్తం 799 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా ఫ్రాంచైజీలు 351 మందిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మంగళవారం వెల్లడించింది. వీరిలో 122 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. కాగా, ఆఫ్ఘానిస్తాన్, యూఏఈ దేశాల ఆటగాళ్లు కూడా వేలంలో పాల్గొంటున్నారు.
Samayam Telugu ipl 2017 auction 351 players to go under the hammer
ఐపీఎల్ 2017 వేలం: రేసులో 351 ప్లేయర్లు


ఆఫ్ఘానిస్తాన్ నుంచి అస్ఘర్ స్టానిక్జియా, మహమ్మద్ నబీ, మహమ్మద్ షాజాద్, రషీద్ ఖాన్, దవ్లత్ జద్రాన్‌తో పాటు యూఏఈ ప్లేయర్ చిరాగ్ సూరి వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్, క్రిస్ వోక్స్ రూ. 2 కోట్ల ప్రారంభ ధరతో వేలంలో నిలుస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియా బౌలింగ్ పెయిర్ మిచెల్ జాన్సన్, పాట్ కమ్మిన్స్‌తో పాటు శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ కూడా అత్యధిక బేస్ ప్రైజ్ లిస్టులో ఉన్నారు.

మొత్తం 23 మంది రూ. 2 కోట్ల ప్రారంభ ధరతో పోటీలో ఉండగా.. భారత్ నుంచి కేవలం ఇశాంత్ శర్మ మాత్రమే ఈ లిస్టులో ఉన్నాడు. కాగా, ఐపీఎల్ 2017 ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 20 నుంచి జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.