యాప్నగరం

అందర్నీ అలరిస్తున్న ఐపీఎల్ థీమ్ సాంగ్!

అలరిస్తున్న ఐపీఎల్ థీమ్ సాంగ్

TNN 3 Mar 2017, 5:49 pm
కొద్ది రోజుల్లో ఆరంభం కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కోసం రూపొందించిన థీమ్‌ సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. తొమ్మిది లీగ్‌లను విజయవంతంగా పూర్తి చేసుకొని పదో సీజన్‌లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ‘దస్‌ సాల్‌ ఆప్కే నామ్‌’ టైటిల్‌తో ఈ పాట రూపొందించారు. బాలీవుడ్‌ సంగీత దర్శకులు సలీమ్‌-సులేమాన్‌ దీనికి సంగీతం సమకూర్చారు. బెన్నీ దాయల్‌ గళం అందించారు.
Samayam Telugu ipl 2017 theme song
అందర్నీ అలరిస్తున్న ఐపీఎల్ థీమ్ సాంగ్!


ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రీడా మైదానంలో ఐపీఎల్-2017 ప్రారంభమవుతుంది. ఈ థీమ్‌సాంగ్‌ ఆకట్టుకునేలా ఉండటంతో అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. సోనీమ్యాక్స్‌.. ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను షేర్‌ చేసిన 48 గంటల్లోనే 25 లక్షల మందికి పైగా వీక్షించారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.