యాప్నగరం

ఐపీఎల్ నుంచి కూడా మహ్మద్ షమీ ఔట్..?

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కెరీర్ మసకబారుతున్నట్లు కనిపిస్తోంది. గత మూడు రోజులుగా షమీపై సంచలనాత్మక

Samayam Telugu 10 Mar 2018, 12:32 pm
భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కెరీర్ మసకబారుతున్నట్లు కనిపిస్తోంది. గత మూడు రోజులుగా షమీపై సంచలనాత్మక ఆరోపణలు గుప్పిస్తున్న అతని భార్య హసీన్ జహాన్.. తాజాగా కోల్‌కతా పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఫాస్ట్ బౌలర్‌పై హత్యాయత్నం, గృహ హింస కేసులు నమోదు చేశారు. ఈ ఆరోపణలు రుజువైతే మహ్మద్ షమీకి కనీసం పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
Samayam Telugu ipl 2018 delhi daredevils reviewing mohammed shami situation
ఐపీఎల్ నుంచి కూడా మహ్మద్ షమీ ఔట్..?


మహ్మద్ షమీ తనని శారీరకంగా హింసిస్తున్నాడని, అతనికి వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఆధారాలతో సహా హసీన్ బహిర్గతం చేయడంతో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ఫాస్ట్ బౌలర్‌కి వార్షిక కాంట్రాక్ట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. తాజాగా కేసుల నేపథ్యంలో ఐపీఎల్‌లో షమీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఫ్రాంఛైజీ కూడా అతడ్ని పక్కన పెట్టాలని యోచిస్తోంది.

బెంగళూరు వేదికగా ఈ ఏడాది జనవరి 27, 28న జరిగిన ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో మహ్మద్ షమీని రూ. 3 కోట్లకి ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభంకానుండగా.. ఒకవేళ సీజన్ మధ్యలో షమీ అరెస్టు అయితే.. టోర్నీకి చెడ్డపేరు వస్తుందని ఢిల్లీ ఫ్రాంఛైజీ, బీసీసీఐ భావిస్తోంది. దీంతో.. అతడ్ని పక్కన పెడితే వచ్చే న్యాయపరమైన చిక్కులపై ప్రస్తుతం బోర్డు చర్చిస్తోంది.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.