యాప్నగరం

ఐపీఎల్ వేలానికి 1003 మంది క్రికెటర్లు రిజిస్టర్

ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జైపూర్ వేదికగా ఈనెల 18న జరగనుండగా.. ఈ వేలానికి ఆశ్చర్యకరరీతిలో ఏకంగా 1,003 మంది క్రికెటర్లు రిజస్టర్ చేసుకున్నారు.

Samayam Telugu 5 Dec 2018, 7:09 pm
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ టోర్నీగా కీర్తి గడించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు యువ క్రికెటర్లు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తున్నారు. ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జైపూర్ వేదికగా ఈనెల 18న జరగనుండగా.. ఈ వేలానికి ఆశ్చర్యకరరీతిలో ఏకంగా 1,003 మంది క్రికెటర్లు రిజస్టర్ చేసుకున్నారు. ఇందులో 232 మంది విదేశీ క్రికెటర్లే ఉండటం ఐపీఎల్‌కి ఉన్న ఆదరణకి నిదర్శనం.
Samayam Telugu prv_1516993500.


బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఇటీవల ఐపీఎల్‌లోని ఫ్రాంఛైజీలన్నీ.. తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెట్టిన క్రికెటర్ల జాబితాని విడుదల చేశాయి. ఆ జాబితాల ప్రకారం.. 8 జట్లలో కలిపి మొత్తం 70 మంది క్రికెటర్ల భర్తీకి అవకాశం ఏర్పడింది. దీంతో.. 1,003 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రిజస్టర్ చేసుకున్నారు.

జాబితాలో 200 మంది అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం ఉన్న ఆటగాళ్లుకాగా.. 800 మంది ఇంకా అరంగేట్రం చేయలేదు. ఈ మొత్తం లిస్ట్‌లో 746 మంది భారత క్రికెటర్లే ఉండగా.. ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్స్ రావడం 11 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే ప్రథమం..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.