యాప్నగరం

కోహ్లీ ఆ డిఫెన్స్ ఏంటి..? ఇది టీ20.. టెస్టు మ్యాచ్ కాదు: పీటర్సన్

విరాట్ కోహ్లీ తొలి బంతి నుంచి హిట్ చేయడం చాలా అరుదు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా గేర్లు మార్చే విరాట్ కోహ్లీ.. బంతి ఏమాత్రం గతి తప్పినా స్టాండ్స్‌లోకి తరలించేస్తుంటాడు. కానీ.. ?

Samayam Telugu 4 Sep 2020, 6:54 am
ఐపీఎల్ 2020 సీజన్ ప్రాక్టీస్ సెషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బంతుల్ని డిఫెన్స్ చేస్తుండటంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మండిపడ్డాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఇప్పటికే అక్కడికి చేరుకున్న విరాట్ కోహ్లీ.. బెంగళూరు టీమ్‌తో కలిసి ప్రాక్టీస్‌ని కొనసాగిస్తున్నాడు. అయితే.. దాదాపు ఐదు నెలల తర్వాత బ్యాట్ పట్టిన కోహ్లీ.. తొలుత బంతిని బ్యాట్‌కి మిడిల్ చేయడానికే అధిక ప్రాధాన్యమిచ్చాడు. ఈ క్రమంలోనే అతను నెట్స్‌లో బంతిని ఎక్కువగా డిఫెన్స్ చేస్తూ కనిపించాడు.
Samayam Telugu Virat Kohli (Photo: AFP)


ప్రాక్టీస్ సెషన్‌లో వికెట్లపైకి దూసుకొస్తున్న బంతిని డిఫెన్స్ చేస్తున్న ఫొటోని తాజాగా విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ‘‘కోహ్లీ బంతిని హిట్ చేయ్. ఇది టీ20.. టెస్టు మ్యాచ్ కాదు’’ అని పీటర్సన్ కామెంట్ చేశాడు. వాస్తవానికి విరాట్ కోహ్లీ పవర్ హిట్టర్ తరహాలో ప్రతి బంతినీ స్టాండ్స్‌లోకి తరలించాలని బ్యాటింగ్ చేయడు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా గేర్లు మారుస్తుంటాడు. అందుకే ఇప్పుడు ఐపీఎల్‌లో టాప్ స్కోరర్‌గా అతను కొనసాగుతున్నాడు.

View this post on Instagram Proper session + proper humidity + great recovery = 😁 @royalchallengersbangalore A post shared by Virat Kohli (@virat.kohli) on Sep 2, 2020 at 11:58pm PDT

ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కే ఆడుతున్న విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకూ 177 మ్యాచ్‌లాడి 131.61 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 5,412 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండగా.. 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 113కాగా.. అతని ఇన్నింగ్స్‌ల్లో 480 ఫోర్లు, 190 సిక్సర్లు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.