యాప్నగరం

ఐపీఎల్ మ్యాచ్‌‌ల టైమింగ్స్ మార్పు‌‌.. తెలివైన నిర్ణయం: ఆకాశ్ చోప్రా

ఐపీఎల్ 2020 సీజన్ యూఏఈ వేదికగా జరగనుండగా.. మ్యాచ్‌లు ఓ అరగంట ముందే ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటనని విడుదల చేసింది.

Samayam Telugu 3 Aug 2020, 9:23 pm
ఐపీఎల్ 2020 సీజన్‌ మ్యాచ్‌ల టైమింగ్స్ మార్పు తెలివైన నిర్ణయమని భారత మాజీ క్రికెటర్/ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగేలా ప్రాథమికంగా షెడ్యూల్ రూపొందించిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్.. మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందులో ఏకంగా 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉండగా.. గత సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది అరగంట ముందే మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.
Samayam Telugu IPL 2020


2008లో ఐపీఎల్ ప్రారంభమవగా.. ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగిశాయి. సాధారణంగా రోజులో రెండు మ్యాచ్‌లు ఉంటే..? మధ్యాహ్నం 4 గంటలకి ఒకటి, రాత్రి 8 గంటలకి మరొకటి జరగడం తొలి సీజన్‌ని ఆనవాయితీగా వస్తోంది. రోజులో ఒక్క మ్యాచ్‌ ఉన్నా.. అది రాత్రి 8 గంటలకే ప్రారంభమయ్యేది. కానీ.. ఐపీఎల్ 2020 సీజన్‌లో మాత్రం అరగంట ముందే.. అంటే.. మధ్యాహ్నం 3.30కి రాత్రి 7.30కి మ్యాచ్‌లు స్టార్ట్ అవుతాయి.

ఐపీఎల్ మ్యాచ్‌ల టైమింగ్స్ మార్పుపై తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ‘‘ఐపీఎల్ మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకే ప్రారంభమవడం అనేది తెలివైన నిర్ణయం. 7.30 తర్వాత (8 గంటలకి) స్టార్ట్ అయ్యే మ్యాచ్‌లు సాధారణంగా రాత్రి 11.30 లేదా 11.45కి ముగుస్తాయి. దాంతో.. మ్యాచ్‌లు ఆఖరి వరకూ చూడటం కొంత మందికి ఇబ్బందే’’ అని వెల్లడించాడు. అర్ధరాత్రి ముగిసే మ్యాచ్‌లకి వ్యూవర్‌‌షిప్ తగ్గిపోతోందని ఇటీవల ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.