యాప్నగరం

క్రీజు వెలుపలికి వెళ్తే..? ఐపీఎల్ 2020లోనూ మాన్కడింగ్ చేస్తా: అశ్విన్

ఐపీఎల్ 2019 సీజన్‌లో జోస్ బట్లర్‌ని మాన్కడింగ్ చేయడం ద్వారా అశ్విన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ టీమ్ కెప్టెన్‌గా ఉన్న అశ్విన్.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ జోస్ బట్లర్‌ని మాన్కడింగ్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌ టీమ్‌ని గెలుపు దిశగా నడిపిస్తున్న బట్లర్.. అశ్విన్ బౌలింగ్ సమయంలో అతను బంతి విసరకముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లాడు. దీంతో.. బౌలింగ్‌ని నిలిపివేసిన అశ్విన్.. బెయిల్స్‌ని పడగొట్టాడు.

Samayam Telugu 31 Dec 2019, 10:06 am

Samayam Telugu ipl 2020 ravichandran ashwin says he will mankad anyone who goes out of crease
క్రీజు వెలుపలికి వెళ్తే..? ఐపీఎల్ 2020లోనూ మాన్కడింగ్ చేస్తా: అశ్విన్

రూల్స్‌ ప్రకారమే.. కానీ కెరీర్‌లో మచ్చ

మ్యాచ్‌లో గెలిచేందుకు అశ్విన్ మోసపూరితంగా వ్యవహరించాడంటూ అభిమానులు విమర్శలు గుప్పించగా.. క్రీడాస్ఫూర్తి తప్పాడంటూ చాలా మంది మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు. అయితే.. అశ్విన్ మాత్రం తాను క్రికెట్ నిబంధనలకి లోబడే మాన్కడింగ్ చేసినట్లు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. అతనికి ఎవరూ అండగా నిలవలేదు. దీంతో.. అశ్విన్ ఐపీఎల్‌ కెరీర్‌లో అదొక మచ్చలా మిగిలిపోయింది.

ఢిల్లీ టీమ్‌కి అశ్విన్ బదిలీ.. అయినా మాన్కడింగ్ చేస్తా

ఐపీఎల్ 2020 సీజన్‌ ఆటగాళ్ల వేలానికి ముందు అశ్విన్‌ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ.. అతడ్ని ఢిల్లీ క్యాపిటల్స్‌కి బదిలీ చేసేసింది. దీంతో.. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఈ సీనియర్ స్పిన్నర్ బరిలోకి దిగబోతున్నాడు. అయితే.. ఐపీఎల్ 2020లోనూ మాన్కడింగ్ చేస్తారా..? అని అశ్విన్‌ని తాజాగా ప్రశ్నించగా.. ‘ఐపీఎల్ 2020లోనూ బంతి విసరక ముందే ఏ బ్యాట్స్‌మెన్‌ క్రీజు వెలుపలికి వెళ్లినా..? నేను మాన్కడింగ్ చేస్తా’ అని బదులిచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.