యాప్నగరం

​ఐపీఎల్ అనుభవమే వారి ధైర్యం: కార్తీక్

శ్రీలంకతో కటక్ వేదికగా బుధవారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్లకి ఐపీఎల్ అనుభవం కలిసొస్తుందని

TNN 19 Dec 2017, 5:21 pm
శ్రీలంకతో కటక్ వేదికగా బుధవారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్లకి ఐపీఎల్ అనుభవం కలిసొస్తుందని మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ ధీమా వ్యక్తం చేశాడు. సీనియర్ క్రికెటర్లు కోహ్లి, శిఖర్ ధావన్, రహానె, భువనేశ్వర్‌లకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు శ్రేయాస్, దీపక్ హుడా, మహ్మద్ షిరాజ్, థంపీ‌లకి ఈ టీ20 సిరీస్‌లో అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించిన ఈ క్రికెటర్లు.. దొరికిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని కార్తీక్ విశ్వాసం కనబర్చాడు.
Samayam Telugu ipl ensures youngsters arent perturbed on the big stage karthik
​ఐపీఎల్ అనుభవమే వారి ధైర్యం: కార్తీక్


‘టీ20 జట్టులోకి వచ్చిన యువ క్రికెటర్లందరికీ ఐపీఎల్ అనుభవం ఉంది. కొంత మంది 20-30 మ్యాచ్‌లు వరకూ ఆడారు. టీమిండియాలో కుదురుకునేందుకు వారికి ఈ అనుభవమే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని నా నమ్మకం. సీనియర్లు ఎక్కువ మంది జట్టులో లేని నేపథ్యంలో గెలిపించే ప్రదర్శనతో సెలక్టర్లని ఆకట్టుకునేందుకు వారికిదే సువర్ణావకాశం. ఒక సీనియర్ క్రికెటర్‌‌గా మైదానంలో వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నేను సిద్ధం. జట్టులో కూడా ఇదే భావన ఉంది’ అని కార్తీక్ వివరించాడు. బుధవారం రాత్రి 7 గంటలకి మ్యాచ్ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.