యాప్నగరం

పఠాన్ బ్రదర్స్ కొత్త బాట..!

చిన్నపిల్లలకే కాదు.. వారికి శిక్షణ ఇచ్చే కోచ్‌లకి కూడా స్టూడెంట్స్ బలాలు, బలహీనతలు వేగంగా గుర్తించేలా ట్రైనింగ్

TNN 16 May 2017, 3:31 pm
భారత్ జట్టుకు దూరమై.. ఐపీఎల్, దేశవాళ్లీ టోర్నీల్లో ఆడుతున్న యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ కొత్త బాట పట్టారు. దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో ‘అకాడమీ ఆఫ్ పఠాన్ (క్యాప్)’ పేరుతో మరో రెండు నెలల్లో క్రికెట్ అకాడమీలు నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు. మొత్తంగా ఏడాదిలోపు కనీసం 20 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు క్యాప్ డైరెక్టర్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించారు. ఈ అకాడమీల్లో చిన్నారులతో పాటు క్రికెట్ కోచ్‌లకి కూడా శిక్షణ ఇవ్వనున్నారని తెలిసింది.
Samayam Telugu irfan yusuf launch cricket academy of pathan cap
పఠాన్ బ్రదర్స్ కొత్త బాట..!


‘భారత్‌లో క్రికెట్ నైపుణ్యానికి కొదవలేదు. కానీ.. చిన్నారులు ఆట నేర్చుకునే సమయంలో కోచ్‌లు సరైన మార్గనిర్దేశం చేయలేకపోతున్నారు. దీంతో వారి నైపుణ్యం మరుగున పడిపోతోంది. క్యాప్ కొత్త తరహా శిక్షణకి శ్రీకారం చుట్టబోతోంది. చిన్నపిల్లలకే కాదు.. వారికి శిక్షణ ఇచ్చే కోచ్‌లకి కూడా స్టూడెంట్స్ బలాలు, బలహీనతలు వేగంగా గుర్తించేలా ట్రైనింగ్ ఇస్తాం’ అని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించారు. ఐపీఎల్ పదో సీజన్‌లో గుజరాత్ లయన్స్ తరఫున ఇర్ఫాన్ పఠాన్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడగా.. అతని సోదరుడు యూసఫ్ పఠాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ బుధవారం హైదరాబాద్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.