యాప్నగరం

బుమ్రా ట్రాఫిక్ ‘నోబాల్’పై వివరణ..!

పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో నో బాల్ విసిరి అపవాదు మూటగట్టుకున్న భారత్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి వార్తల్లో నిలిచాడు.

TNN 24 Jun 2017, 4:59 pm
పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో నో బాల్ విసిరి అపవాదు మూటగట్టుకున్న భారత్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి వార్తల్లో నిలిచాడు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి కొత్త తరహాలో అవగాహన కల్పించేందుకు జైపూర్ ట్రాఫిక్ పోలీసులు బుమ్రా ‘నో బాల్’ ఫొటోని వాడుకున్నారు. వాహనదారులు ‘గీత దాటకండి.. దాటితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని ప్రధాన కూడళ్లలో బిల్‌బోర్డ్స్‌ని ఏర్పాటు చేశారు. ఫైనల్లో బుమ్రా నో బాల్ వేయడంతో ఔట్ నుంచి బయటపడిన ఫకార్ జమాన్ ఏకంగా శతకం బాది పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
Samayam Telugu jaipur traffic police clarify to jasprit bumrah for overstepping
బుమ్రా ట్రాఫిక్ ‘నోబాల్’పై వివరణ..!


ఈ ట్రాఫిక్ ప్రచార బిల్‌బోర్డ్స్‌పై బుమ్రా స్పందించాడు. ‘జైపూర్ ట్రాఫిక్ పోలీసులు.. చాలా బాగా చేశారు. దేశం తరఫున అత్యుత్తమంగా పోరాడినందకు మీరు ఎంత గౌరవం ఇస్తున్నారో ఈ పోస్టర్ చూపుతోంది. మీరేమీ కంగారుపడకండి. మీరు చేసే తప్పులు ఎత్తిచూపుతూ నేనేమీ అపహాస్యం చేయను. ఎందుకంటే తప్పిదాలు చేసేవారిని నేను నమ్ముతాను’ అని ట్వీట్ చేశాడు. బుమ్రా ట్వీట్‌పై జైపూర్ ట్రాఫిక్ పోలీసు శాఖ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ‘ప్రియమైన బుమ్రా, మా ఉద్దేశం మిమ్మల్ని, క్రికెట్ అభిమానుల్ని కించపరచాలని కాదు. మేము కేవలం వాహనదారులకి ట్రాఫిక్‌పై మరింత అవగాహన పెంచేందుకే అలా చేశాం. మీరు యూత్ ఐకాన్, మా అందరికీ స్ఫూర్తిదాయకం అంటూ ఆ శాఖ ట్వీట్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.