యాప్నగరం

టఫ్ క్యాచ్ పట్టి.. ఈజీ క్యాచ్ వదిలేశారే..?

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఇరు జట్ల ఫీల్డర్లు మెరుపు క్యాచ్‌లతో తొలుత ఊపు తెప్పించి..

TNN 18 Sep 2017, 4:30 pm
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఇరు జట్ల ఫీల్డర్లు మెరుపు క్యాచ్‌లతో తొలుత ఊపు తెప్పించి.. అనంతరం సులువైన క్యాచ్‌ల్ని నేలపాలు చేసి ఉసూరమనిసించారు. మొదట భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా కొట్టిన బంతిని అద్భత రీతిలో జంప్ చేసి ఆసీస్ ఫీల్డర్ మాక్స్‌వెల్ ఒంటిచేత్తో క్యాచ్‌గా అందుకున్నాడు. అయితే.. అనంతరం కొద్దిసేపటికే ఆ జట్టు కెప్టెన్ స్టీవ్‌స్మిత్ స్లిప్‌లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య ఇచ్చిన సులువైన క్యాచ్‌ల్ని అందుకోవడంలో ఘోరంగా విఫమయ్యాడు.
Samayam Telugu jasprit bumrah glenn maxwell take stunning catches in india vs australia odi
టఫ్ క్యాచ్ పట్టి.. ఈజీ క్యాచ్ వదిలేశారే..?


మరోవైపు భారత్ జట్టులో కూడా ఇదే తరహా‌లో రెండు క్యాచ్‌లు మిస్ అవగా.. ఒక కష్టతరమైన క్యాచ్‌ని జస్‌ప్రీత్ బుమ్రా అందుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్.. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్ స్కైర్‌లెగ్ దిశగా గాల్లోకి లేపేశాడు. బంతిని గమనిస్తూ.. వెనక్కి పరుగెత్తుతూ వెళ్లిన బుమ్రా.. చక్కగా బంతిని ఒడిసిపట్టుకున్నాడు. అయితే.. మ్యాచ్ చివర్లో ఫీల్డర్లు మనీశ్ పాండే, అజింక్య రహానెలు మాత్రం చెరో క్యాచ్‌ని బౌండరీ లైన్ వద్ద జారవిడిచారు. ఈ మ్యాచ్‌లో భారత్ 26 పరుగుల తేడాతో గెలుపొంది.. ఐదు వన్డేల సిరీస్‌‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.