యాప్నగరం

బుమ్రా నోబాలే మ్యాచ్‌లో కీలక మలుపు

ధర్మశాల వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వేసిన నోబాలే మ్యాచ్ ఫలితాన్ని

TNN 11 Dec 2017, 4:51 pm
ధర్మశాల వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వేసిన నోబాలే మ్యాచ్ ఫలితాన్ని మార్చివేసిందని లంక కోచ్ నికో పోథస్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 112 పరుగులకు ఆలౌటవగా.. అనంతరం ఛేదన ఆరంభంలోనే శ్రీలంక 7/1తో కష్టాల్లో నిలిచింది. ఈ దశలోనే ఉపుల్ తరంగ వికెట్‌ని బుమ్రా తీసినా.. రిప్లైలో అది నోబాల్‌గా తేలడంతో అతనికి జీవనదానం లభించింది. చివరికి తరంగ (49: 46 బంతుల్లో 10x4) కీలక ఇన్నింగ్స్‌తో శ్రీలంక ఛేదనని 20.4 ఓవర్లలోనే పూర్తి చేయగలిగింది.
Samayam Telugu jasprit bumrahs no ball a massive moment nic pothas
బుమ్రా నోబాలే మ్యాచ్‌లో కీలక మలుపు


‘ధర్మశాల వన్డేలో రెండు అంశాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. ఒకటి శ్రీలంక టాస్ గెలవడం.. రెండు నోబాల్‌ కారణంగా ఉపుల్ తరంగకి జీవనదానం లభించడం. తొలి వికెట్‌ కోల్పోయిన కొద్ది నిమిషాల్లోనే మరో వికెట్ పడుంటే కచ్చితంగా లంక ఒత్తిడిలో పడేది. ఎందుకంటే.. తర్వాత వికెట్ (తిరుమానె) 19 పరుగుల వద్దే పడింది. ఉపుల్ తరంగ బంతి నోబాల్‌గా కాకుండా ఉండి ఉంటే.. 19/3 నుంచి జట్టు కోలుకోవడం కష్టమయ్యేది’ అని కోచ్ గుర్తు చేశాడు. రెండో వన్డే మొహాలి వేదికగా బుధవారం జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.