యాప్నగరం

బుమ్రా కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసం.. కానీ?

జొహెన్నెస్‌బర్గ్ టీ20 మ్యాచ్‌లో బుమ్రా కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసంతో బంతిని సిక్స్ వెళ్లకుండా ఆపేందుకు యత్నించాడు.

TNN 19 Feb 2018, 1:59 pm
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా అద్భుత ఫీల్డింగ్ విన్యాసంతో అలరించాడు. పాండ్య విసిరిన బంతిని మిల్లర్ బలంగా బాదగా.. బౌండరీ లైన్ దగ్గరున్న బుమ్రా ఆ బంతిని అందుకోవడానికి విఫల యత్నం చేశాడు. అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నప్పటికీ.. బౌండరీ లైన్ ఆవల పడిపోయే ఛాన్స్ ఉండటంతో మైదానంలోకి బంతిని విసిరి కింద పడిపోయాడు. బంతి సిక్స్ వెళ్లకుండా బుమ్రా చేసిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది.
Samayam Telugu jasprit bumrahs stunning effort in field leaves fans bemused
బుమ్రా కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసం.. కానీ?


బుమ్రా బంతిని అందుకునే ముందు అతడి పాదం బౌండరీ లైన్‌ను తాకింది. తర్వాత గాల్లోకి ఎగిరిన బుమ్రా.. బంతిని అందుకొని.. తిరిగి నేలను తాకేలోగానే విసిరేశాడు. కానీ అంపైర్ దాన్ని సిక్స్ ఇచ్చాడు. కొత్త నిబంధనల ప్రకారం ఫీల్డర్ బంతిని టచ్ చేసే ముందు బౌండరీ లైన్ తాకొద్దు. కానీ బుమ్రా లెగ్ బౌండరీ లైన్‌ను తాకింది. అంపైర్ దాన్ని సిక్సర్‌గా ప్రకటించినప్పటికీ.. బుమ్రా ప్రయత్నం మాత్రం నెటిజన్ల మనసు దోచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.