యాప్నగరం

రూట్, బెయిర్‌స్టో‌లకు రికార్డును దూరం చేసిన జడేజా

రవీంద్ర జడేజా ఇద్దరు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రికార్డులకు అడ్డు తగిలాడు. ఆ జట్టు తరఫున ఒక ఏడాదిలో అత్యధిక..

TNN 20 Dec 2016, 2:12 pm
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ఐదు పరుగుల తేడాతో ఓ రికార్డును కోల్పోయాడు. చెన్నై టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆరు పరుగుల వద్ద అవుటైన రూట్ ఈ ఏడాది 1477 పరుగులు చేశాడు. మరో ఐదు పరుగులు చేసి ఉంటే.. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ రికార్డు నెలకొల్పేవాడు. 2002లో ఇంగ్లిష్ ఆటగాడు మైకెల్ వాన్ 1481 పరుగులు చేశాడు. ఇప్పటి వరకూ ఇంగ్లండ్ తరఫున ఇదే అత్యధికం. వాస్తవానికి ఈ సిరీస్‌లో రూట్ అద్భుతంగా ఆడాడు. ఓ సెంచరీతోపాటు నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. కానీ చివరి టెస్టు.. ఆఖరి రోజు మాత్రం తడబడ్డాడు. జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా అవుటై దీంతో అరుదైన రికార్డును మిస్ చేసుకున్నాడు. గతేడాది 1385 రన్స్ చేసిన రూట్ ఈ ఏడాది వాన్ రికార్డుకు మరింత చేరువయ్యాడు. కానీ జడేజా రూపంలో అతడికి అడ్డంకి ఎదురైంది.
Samayam Telugu joe root missed michael vaughan record by 4 runs
రూట్, బెయిర్‌స్టో‌లకు రికార్డును దూరం చేసిన జడేజా


మరో ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్ స్టో ఇంకో 12 పరుగులు చేసి ఉంటే వాన్ రికార్డును అధిగమించేవాడే. కానీ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి ఒక్క పరుగు వద్దే వెనుదిరిగాదు. దీంతో చక్కటి అవకాశం చేజారింది. ఇద్దరు ఆటగాళ్లు ఒకే ఇన్నింగ్స్‌లో వాన్ రికార్డును బద్దలుకొట్టే అవకాశాన్ని కోల్పోవడంలో ఒక్క ఆటగాడే కీలక పాత్ర పోషించడం విశేషం. రూట్‌ను ఎల్బీగా అవుట్ చేసిన జడేజా.. బెయిర్ స్టోను క్యాచ్‌ను పట్టాడు. దీంతో వాన్ స్కోరును దాటలన్న వారిద్దరి ఆశలు ఆవిరయ్యాయి.

చెన్నై టెస్టులో చివరి రోజు టీ విరామ సమయానికి ఇంగ్లండ్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. మొయిన్ అలీ 32 పరుగులతో, బెన్ స్టోక్స్ 13 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.