యాప్నగరం

రూట్.. పిల్లాడిలా మాట్లాడొద్దు: పాంటింగ్

ఆస్ట్రేలియా చేతిలో యాసెష్ సిరీస్‌ ఓడిపోవడంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు..

TNN 23 Dec 2017, 7:00 pm
ఆస్ట్రేలియా చేతిలో యాసెష్ సిరీస్‌ ఓడిపోవడంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు.. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు అలిస్టర్ కుక్, స్టువర్ట్ బ్రాడ్‌‌‌ల ప్రదర్శనపై పెదవి విరుస్తుండగా.. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నోటికి పనిచెప్పాడు. యాసెష్ సిరీస్‌ ఓటమి అనంతరం జో రూట్‌ చెప్పిన కారణాలు.. చిన్నపిల్లాడి మాటల్ని తలపించాయని ఎద్దేవా చేశాడు. ఐదు టెస్టుల ఈ సిరీస్‌‌లో ఆస్ట్రేలియా 3-0తో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది. కెప్టెన్‌గా రూట్‌కి ఇదే తొలి యాషెస్.
Samayam Telugu joe root should stop acting like a little boy ricky ponting
రూట్.. పిల్లాడిలా మాట్లాడొద్దు: పాంటింగ్


‘జో రూట్ గతంలో ఎన్నడూ లేనంత ఒత్తిడిలో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌ పోరు అంటేనే ఇది. అతను ఇప్పటి వరకు ఆడిన క్రికెట్ ఒక ఎత్తు.. యాషెస్ ఒక ఎత్తు. సిరీస్‌లో మ్యాచ్ తీవ్రత.. ఒత్తిడి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సిరీస్ ఓడిన తర్వాత.. రూట్ చెప్పిన సమాధానాలు చిన్న పిల్లాడి మాటల్లా ఉన్నాయి. ఒక జట్టుకి కెప్టెన్‌ ఉన్నతంగా మాట్లాడాలి. ముఖ్యంగా.. జట్టు పరాజయాలు చవిచూస్తున్నప్పుడు మరింత హుందాగా ఉండాలి. మనసులో ఎంతైనా బాధ ఉండొచ్చు. కానీ.. ముఖంలో వాటిని చూపించకుండా కనీసం మేనేజ్ చేయడాన్ని రూట్ నేర్చుకోవాలి’ అని పాంటింగ్ సూచించాడు. సిరీస్‌లో నాలుగో టెస్టు మెల్‌బోర్న్ వేదికగా మంగళవారం ఆరంభంకానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.