యాప్నగరం

గంభీర్‌తో గొడవపై పెదవివిప్పిన కమ్రాన్ అక్మల్

అఫ్రిది బౌలింగ్‌లో గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఓ రెండు బంతులు బ్యాట్‌కి అత్యంత సమీపం నుంచి కీపర్ కమ్రాన్ అక్మల్ చేతుల్లోకి వెళ్లాయి. దాంతో.. అక్మల్ బిగ్గరగా ఔట్ అప్పీలు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు.

Samayam Telugu 30 Apr 2020, 10:53 am
భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌తో గొడవపై పాకిస్థాన్ సీనియర్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఎట్టకేలకి పెదవివిప్పాడు. శ్రీలంక వేదికగా 2010లో జరిగిన ఆసియా కప్‌లో గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ చేస్తుండగా.. కమ్రాన్ అక్మల్ అస్తమానం కీపర్ క్యాచ్‌ కోసం అప్పీల్ చేశాడు. దాంతో సహనం కోల్పోయిన గౌతమ్ గంభీర్ అతనికి చిన్నపాటి వార్నింగ్ ఇవ్వగా.. కమ్రాన్ అక్మల్ కూడా అదే తరహాలో బదులివ్వడంతో మైదానంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
Samayam Telugu Kamran Akmal ,Gautam Gambhir


Read More: undefinedundefined
మ్యాచ్‌లో అఫ్రిది ఓవర్ ముగిసిన తర్వాత ఫీల్డ్ అంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇవ్వగా.. మరోసారి గంభీర్, కమ్రాన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునేలా కనిపించారు. అయితే.. మధ్యలో అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పగా.. అప్పుడు గంభీర్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్న మహేంద్రసింగ్ ధోనీ.. గంభీర్‌ని శాంతపరిచాడు. ఆ తర్వాత 2012-13లో భారత్, పాకిస్థాన్ మధ్య బెంగళూరు వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇషాంత్ శర్మతోనూ కమ్రాన్ అక్మల్‌ వాగ్వాదానికి దిగాడు.

గంభీర్‌తో గొడవపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ ‘‘ఆ మ్యాచ్‌లో భేదాభిప్రాయాల కారణంగా గొడవ జరిగింది. కానీ.. ఆ ఘటనని మేము ఇద్దరం మైదానంలోనే మరిచిపోయి.. ఫ్రెండ్స్‌గా ఉన్నాం. క్రికెట్ టూర్స్ సమయంలో కలిసి భోజనం కూడా చేశాం. ఇప్పటికీ పరస్పరం గౌరవించుకుంటున్నాం’’ అని వెల్లడించాడు.


Read More: నన్ను క్షమించండి.. 19 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన పాక్ క్రికెటర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.