యాప్నగరం

భారత్ బౌలింగ్ దాడే.. ఓ వ్యూహం

భారత్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వరుస తప్పిదాలతోనే తాము మ్యాచ్‌ని చేజార్చుకున్నట్లు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్

TNN 2 Nov 2017, 6:57 pm
భారత్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వరుస తప్పిదాలతోనే తాము మ్యాచ్‌ని చేజార్చుకున్నట్లు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెల్లడించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ కివీస్ విఫలమైందని.. అనుభవం ఉన్న క్రికెటర్లు కూడా ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని విలియమ్సన్ అసహనం వ్యక్తం చేశాడు. భారత్‌ లాంటి కఠిన ప్రత్యర్థిని టీ20ల్లో ఎదుర్కొనేటప్పుడు మెరుగైన ప్రదర్శన చేయాలని.. ఒకవేళ విఫలమైతే ఫలితాలు ఎలా ఉంటాయో మరోసారి తెలిసొచ్చిందన్నాడు.
Samayam Telugu kane williamson bhuvneshwar kumar jasprit bumrah most consistent bowlers in world cricket
భారత్ బౌలింగ్ దాడే.. ఓ వ్యూహం


‘భారత్ బౌలింగ్ విభాగం భువనేశ్వర్, జస్‌ప్రీత్ బుమ్రాతో చాలా పటిష్ఠంగా ఉంది. వారు చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో మ్యాచ్ గమనానికి అనుగుణంగా బంతులు విసురుతున్నారు. దీంతో టీమిండియా బౌలింగ్ దాడి వ్యూహం ప్రకారం సాగుతోంది. భువీ, బుమ్రాల బౌలింగ్ శైలిని ఈ సిరీస్‌లోనే కాదు.. ఐపీఎల్‌లో కూడా నేను గమనించాను. ప్రపంచ క్రికెట్‌లోనే ఈ జోడి చాలా స్థిరంగా ఎదుగుతోంది’ అని విలియమ్సన్ ప్రశంసించాడు. రెండో టీ20 మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా శనివారం జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.