యాప్నగరం

హార్దిక్ రాకతోనే జట్టులో సమతూకం..!

భారత యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యాను.. గత ఏడాది దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్‌తో పోలిస్తే చాలా మంది నొసలు చిట్లించారు.

TNN 9 Jan 2018, 1:52 pm
భారత యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యాను.. గత ఏడాది దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్‌తో పోలిస్తే చాలా మంది నొసలు చిట్లించారు. అతని స్థాయిని హార్దిక్ అందుకోవాలంటే మరికొంత సమయం పడుతుందన్నారు. కానీ.. సోమవారం దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి టెస్టులో ఈ యువ ఆల్‌రౌండర్ ప్రదర్శన చూసిన తర్వాత స్వయంగా కపిల్‌దేవ్ అతనిపై ప్రశంసల జల్లు కురిపించారు. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో మొత్తం రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిసి 94 పరుగులు చేసిన హార్దిక్ పాండ్య.. మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ముఖ్యంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ బౌలర్లకి ఎదురు నిలిచి.. ఒంటరి పోరాటంతో హార్దిక్ చేసిన 93 పరుగులకి అందరూ ఫిదా అయిపోయారు.
Samayam Telugu kapil dev hardik pandya can become indias next genuine all rounder
హార్దిక్ రాకతోనే జట్టులో సమతూకం..!


హార్దిక్ పాండ్యాని తనతో పోల్చడంపై కపిల్‌దేవ్ మంగళవారం మాట్లాడుతూ ‘కాలమే అన్నీ నిర్ణయిస్తుంది. మరి కొంత కాలం వేచి చూద్దాం. హార్దిక్‌లో చాలా ప్రతిభ ఉంది. అతని రాకతో జట్టులో కూడా సమతూకం వచ్చింది. జట్టులో సిసలైన ఆల్‌రౌండర్ ఒకరుంటే.. తుది జట్టు ఎంపికలో కెప్టెన్‌కి ఒక అదనపు వెసులబాటు ఉంటుంది. జట్టులోని కుర్రాళ్లు చాలా నిబద్ధతతో క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్‌ వైపు చూస్తోంది’ అని కపిల్‌దేవ్ వివరించారు. మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో టెస్టు సెంచూరియన్ వేదికగా శనివారం నుంచి జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.