యాప్నగరం

మూడో టెస్టుకు కీపర్‌గా దినేష్ కార్తీక్

దక్షిణాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌కు కీపర్‌గా దినేష్ కార్తీక్ వస్తు్న్నాడు.

TNN 16 Jan 2018, 2:15 pm
దక్షిణాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌కు కీపర్‌గా దినేష్ కార్తీక్ వస్తు్న్నాడు. వృద్ధిమాన్ సాహాకు గాయం కావడంతో అతని స్థానంలో దినేష్ కార్తీక్‌ పేరును ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సిఫారుసు చేసింది. జనవరి 24 నుంచి ప్రారంభకానున్న ఆఖరి టెస్టు కోసం ఈ తమిళనాడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జట్టులో చేరతాడు.
Samayam Telugu karthik named as replacement for injured saha
మూడో టెస్టుకు కీపర్‌గా దినేష్ కార్తీక్


రెండో టెస్టుకు ముందు సన్నాహకంగా నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడ్డాడు. ఆయన ఎడమకాలి తొడ కండరాలు పట్టేశాయి. సాహా ఫిట్‌నెస్‌ను బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షిస్తోంది. దక్షిణాఫ్రికా టూర్‌కు ప్రత్యామ్నాయ కీపర్‌గా తీసుకువచ్చిన పార్థివ్ పటేల్ ప్రస్తుతం రెండో టెస్టులో ఆడుతున్నాడు. అయితే అతని ప్రదర్శన అంత బాగాలేకపోవడంతో ఆఖరి టెస్టుకు దినేష్ కార్తీక్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

ఫైనల్ టెస్టులో గనుక పార్థీవ్ స్థానంలో కార్తీక్ ఆడితే.. 2010 తరవాత అతనికి ఇదే తొలి టెస్టు అవుతుంది. దినేష్ తన ఆఖరి టెస్టును బంగ్లాదేశ్‌పై చిట్టగాంగ్‌లో ఆడాడు. ఇప్పటి వరకు 23 టెస్టులు ఆడిన దినేష్.. 27.78 సగటుతో 1000 పరుగులు చేశాడు. ఒక సెంచరీ కూడా కొట్టాడు. మూడో టెస్టుకు దినేష్ కార్తీక్ ఎంపిక కావడం వల్ల అతనికి మంచే జరిగింది. ఎందుకంటే పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు ఎలాగూ దినేష్ కార్తీక్‌నే కీపర్‌గా తీసుకుంటారు. కాబట్టి దక్షిణాఫ్రికా పరిస్థితులకు అలవాటు పడటానికి కార్తీక్‌కు ఇది మంచి అవకాశం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.