యాప్నగరం

టి20 జట్టులో తొలిసారి ఓ కశ్మీరి!

జమ్మూ కశ్మీర్ నుంచి నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా గుర్తింపుతెచ్చుకున్న పర్వీజ్ రసూల్ ఎట్టకేలకు భారత టి20 జట్టులోకి అడుగుపెట్టాడు.

TNN 26 Jan 2017, 5:32 pm
జమ్మూ కశ్మీర్ నుంచి నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా గుర్తింపుతెచ్చుకున్న పర్వీజ్ రసూల్ ఎట్టకేలకు భారత టి20 జట్టులోకి అడుగుపెట్టాడు. కాన్పూర్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈరోజు జరుగుతున్న టి20 మ్యాచ్‌లో రసూల్ ఆడుతున్నాడు. ఇతనికి ఇదే తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్. అలాగే జమ్మూ కశ్మీర్ నుంచి భారత టి20 జట్టుకు ఎంపికైన తొలి ఆటగాడు కూడా రసూల్ కావడం విశేషం. ఆట ప్రారంభానికి ముందు భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ సరందీప్ సింగ్ నుంచి రసూల్ క్యాప్ అందుకున్నాడు.
Samayam Telugu kashmir all rounder parveez rasool making his t20 debt
టి20 జట్టులో తొలిసారి ఓ కశ్మీరి!


ఈ మేరకు సరందీప్ నుంచి రసూల్ క్యాప్ అందుకుంటున్న ఫొటోను బీసీసీఐ ట్విట్టర్లో ఉంచింది. ‘రిపబ్లిక్ డే రోజున పర్వీజ్ రసూల్ టి20 క్యాప్‌ను అందుకోవడం గర్వకారణం’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది. కాగా, 27 ఏళ్ల రసూల్‌ స్వస్థలం జమ్మూకశ్మీర్‌లోని బిజ్‌బెహరా. ఇప్పటి వరకు 58 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రసూల్ 3343 పరుగులు సాధించాడు. దీనిలో 8 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి. గతంలో ఒక అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కూడా ఆడాడు. 2014లో బంగ్లాదేశ్‌తో ఢాకాలో జరిగిన మ్యాచ్‌తో రసూల్ అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమైంది.
Proud moment for @ImParveezRasool as he gets his T20I India cap on #RepublicDay #INDvENG pic.twitter.com/Ac44QBryKW — BCCI (@BCCI) January 26, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.