యాప్నగరం

యువరాజ్‌ని వదిలేసిన కింగ్స్ పంజాబ్..!

ఐపీఎల్ 2018 సీజన్‌‌లో భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన యువరాజ్ సింగ్ చేసిన పరుగులు 65 మాత్రమే. అతని సగటు ఆశ్చర్యకరంగా 10.38గా ఉండటం విశేషం.

Samayam Telugu 15 Nov 2018, 7:19 pm
ఐపీఎల్ 2018 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన యువరాజ్ సింగ్‌ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ ఈరోజు విడిచిపెట్టింది. 2019 సీజన్ కోసం డిసెంబరులో ఆటగాళ్ల వేలం జరగనుండగా.. ఈరోజు ముగిసే లోపు ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, విడిచిపెట్టే ఆటగాళ్ల జాబితాని ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీలు జాబితాని విడుదల చేయగా.. తాజా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ కూడా జాబితాని ప్రకటించింది.
Samayam Telugu Yuvraj-Singh-1-620x400


ఐపీఎల్ 2018 సీజన్‌‌లో భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన యువరాజ్ సింగ్ చేసిన పరుగులు 65 మాత్రమే. అతని సగటు కేవలం 10.38. దీంతో.. అతడ్ని వచ్చే ఏడాది జట్టులో కొనసాగించేందుకు పంజాబ్ ఆసక్తి కనబర్చలేదు. ఇక ఆస్ట్రేలియా హిట్టర్ అరోన్ ఫించ్ 10 మ్యాచ్‌లాడి 134 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. అతడ్ని కూడా పంజాబ్ విడిచిపెట్టేసింది. మొత్తంగా 9 మంది ఆటగాళ్లని మాత్రమే పంజాబ్ ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకుంది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు వీరే..! కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, క్రిస్‌గేల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, ఆండ్రూ టై, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అంకిత్ రాజ్‌పుత్, డేవిడ్ మిల్లర్

విడిచిపెట్టిన ఆటగాళ్లు: యువరాజ్ సింగ్, అరోన్ ఫించ్, మోహిత్ శర్మ, మనోజ్ తివారి, బరిందర్ శరణ్, అక్షదీప్ నాథ్, ప్రదీప్ సాహూ, మయాంక్ డాగర్, మంజూర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.