యాప్నగరం

కేఎల్ రాహుల్‌కి ఛాన్స్‌లివ్వండి: దేశ్‌గుప్త

టీమిండియాకి ధోనీ దూరమవగా.. వన్డే, టీ20 జట్టులో కీపర్లుగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ముందు వరుసలో ఉన్నారు. కానీ.. ఐపీఎల్ జరిగితే వీరితో పాటు ధోనీ కూడా రేసులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Samayam Telugu 13 Apr 2020, 9:14 pm
భారత బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌కి అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియా మేనేజ్‌మెంట్ అవకాశాలివ్వాలని మాజీ వికెట్ కీపర్ దీప్ దేశ్‌గుప్త సూచించాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత సీనియర్ వికెట్ కీపర్ ధోనీ.. టీమిండియాకి దూరమవగా.. అతని స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. కేఎల్ రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్‌గా నిలకడగా రాణించాడు. దీంతో టీ20 వరల్డ్‌‌కప్ జట్టులోనూ రాహుల్‌కి అవకాశమివ్వాలని దేశ్‌గుప్త సూచించాడు.
Samayam Telugu KL Rahul T20


Read More : కోహ్లీని ఆ పాకిస్థాన్ క్రికెటర్ బీట్ చేయగలడా..?

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. కీపర్ రేసులో రాహుల్, పంత్ ముందు వరుసలో ఉన్నారు. ఐపీఎల్ 2020 సీజన్ జరిగి.. ధోనీ ఫామ్ నిరూపించుకోగలిగితే అప్పుడు ధోనీ కూడా ఈ రేసులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ.. కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. ఏప్రిల్ 15కి వాయిదాపడగా.. ఇప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో టోర్నీ జరగడంపై సందిగ్ధత నెలకొంది.

Read More: ధోనీని ఎలా ఎంపిక చేస్తారు..?: గౌతమ్ గంభీర్

కేఎల్ రాహుల్‌ గురించి దేశ్‌గుప్త మాట్లాడుతూ ‘‘రాహుల్‌‌కి మూడు ఫార్మాట్లలోనూ అవకాశాలివ్వాలి. అతను క్వాలిటీ బ్యాట్స్‌మెన్ అలానే మంచి వికెట్ కీపర్ కూడా. అందుకే నా సూచన ఏంటంటే..? అతనికి టీ20 జట్టులో రెగ్యులర్‌గా ఛాన్స్‌లివ్వాలి. ఏడాది వ్యవధిలోనే రెండు టీ20 వరల్డ్‌కప్‌లు జరగనున్న నేపథ్యంలో.. రాహుల్ టీ20 జట్టులో ఉండటం కీలకం. ఇక వన్డేల్లో నెం.5లో రాహుల్ నిలకడగా రాణిస్తున్నాడు. కానీ.. అతనితో కీపింగ్ చేయించాలా..? వద్దా..? అనేది మేనేజ్‌మెంట్ నిర్ణయం’’ అని వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.