యాప్నగరం

ఆ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్ రాహుల్

శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాధించాడు. ఇప్పటి వరకూ ఏ భారత బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కాని రీతిలో..

TNN 12 Aug 2017, 12:59 pm
పల్లెకెలేలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. చక్కటి ఫామ్‌లో ఉన్న రాహుల్ ఈ మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీ సాధించడం ద్వారా వరుసగా ఏడు టెస్టుల్లో హాఫ్ సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడు రాహుల్ కావడం గమనార్హం. వెస్టిండీస్ ఆటగాళ్లు ఎవర్టన్ వీక్స్, శివ నారాయణ్ చంద్రపాల్, శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర, ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్ రోజర్స్, జింబాబ్వే మాజీ ప్లేయర్ ఆండీ ఫ్లవర్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.
Samayam Telugu kl rahul is the first indian to score seven consecutive half centuries
ఆ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్ రాహుల్


వరుసగా ఆరు టెస్టుల్లో అర్ధ శతకాలు చేసిన గుండప్ప విశ్వనాథ్, రాహుల్ ద్రవిడ్‌ల రికార్డులను పల్లకెలే టెస్టులో అర్ధ శతకం ద్వారా రాహుల్ బ్రేక్ చేశాడు. వైరల్ ఫీవర్ కారణంగా లంకతో తొలి టెస్టుకు దూరమైన రాహుల్.. భారత గడ్డ మీద ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. ఆసీస్‌పై అతడు వరుసగా.. 90, 51, 67, 60, 51 (నాటౌట్) పరుగులు చేశాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టెస్టుల్లో నిలకడ లేమితో ఇబ్బంది పడిన రాహుల్.. వరుసబెట్టి అర్ధశతకాలు బాది తనేంటో నిరూపించుకున్నాడు.

పల్లకెలే టెస్టులో ఓపెనర్లు రాహుల్, ధావన్ భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ అర్ధ సెంచరీలు చేయడంతో భారత్ 30.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 150 పరుగులు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.