యాప్నగరం

టీ20 ర్యాంకింగ్స్‌లో కోహ్లీ కంటే రాహుల్ టాప్

శ్రీలంకతో తాజాగా ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో నిలకడగా రాణించిన భారత ఓపెనర్ కేఎల్ రాహుల్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో నిలిచాడు. ఇండోర్ టీ20లో 45 పరుగులు చేసిన ఈ ఓపెనర్.. పుణె టీ20లో 54 పరుగులు చేయడం ద్వారా సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శుక్రవారం రాత్రి భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ముగియడంతో ఈరోజు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ని ప్రకటించింది.

Samayam Telugu 11 Jan 2020, 5:04 pm

Samayam Telugu kl rahul jumps to 6th captain virat kohli enters top 10 in icc t20i rankings
టీ20 ర్యాంకింగ్స్‌లో కోహ్లీ కంటే రాహుల్ టాప్

భారత్ తరఫున టీ20 ర్యాంకింగ్స్‌లో రాహుల్ టాప్

బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ 879 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. కేఎల్ రాహుల్ 760 పాయింట్లతో 6వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక శ్రీలంకపై టీ20 సిరీస్‌లో కుర్రాళ్లకి అవకాశం ఇవ్వడం కోసం బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి వెళ్లిన విరాట్ కోహ్లీ 683 పాయింట్లతో 9వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్ తరఫున టాప్-10‌లో ఈ ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కింది.

వన్డే, టెస్టుల్లో కోహ్లీ నెం.1.. కానీ.. టీ20ల్లో వెనుకే

ఇండోర్ టీ20లో 17 బంతులు ఎదుర్కొని 30 పరుగులతో అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ.. పుణె టీ20లో 17 బంతుల్లో 26 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 4, 6 స్థానాల్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయడంతో.. అతనికి ఎక్కువగా పరుగులు చేసే అవకాశం దక్కలేదు. ఐసీసీ వన్డే, టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ నెం.1 స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.