యాప్నగరం

యువీ స్థానంలో రాహుల్‌ని పంపిస్తాం..!

కేఎల్ రాహుల్‌ని ఆ స్థానంలో దించాలని భారత్ యోచిస్తోంది. తర్వాత.. కేదార్ జాదవ్, ధోని, హార్దిక్ పాండ్య బ్యా

TNN 14 Aug 2017, 6:02 pm
శ్రీలంకతో ఆగస్టు 20 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఊహించని మార్పులు చోటు చేసుకోనున్నట్లు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పరోక్షంగా వెల్లడించారు. ఆదివారం ప్రకటించిన భారత్ జట్టులో సీనియర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్‌పై వేటు వేసిన సెలక్టర్లు.. సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్‌లకి సైతం మొండిచేయి చూపిన విషయం తెలిసిందే. సోమవారం జట్టు ఎంపికపై ఎమ్మెస్కే మాట్లాడారు.
Samayam Telugu kl rahul will play at number four in the sri lanka odis
యువీ స్థానంలో రాహుల్‌ని పంపిస్తాం..!


జట్టులో ముగ్గురు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌ రూపంలో ఉన్నందున ఒకరిని బ్యాటింగ్ ఆర్డర్ దిగువకి పంపాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. వన్డే, టీ20ల్లో గత కొంతకాలంగా మెరుగ్గా రాణిస్తున్న ధానవ్, రోహిత్ ఓపెనర్లుగా వస్తే.. మూడో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లి ఫిక్స్. ఇక కీలకమైన నాలుగో స్థానంలో ఇప్పటివరకు యువరాజ్ సింగ్ వచ్చేవాడు. అయితే.. తాజాగా అతనిపై వేటు పడిన నేపథ్యంలో కేఎల్ రాహుల్‌ని ఆ స్థానంలో దించాలని భారత్ యోచిస్తోంది. తర్వాత.. కేదార్ జాదవ్, ధోని, హార్దిక్ పాండ్య బ్యాటింగ్‌కి వస్తున్నారు. కానీ.. ఇటీవల హార్దిక్ హిట్టింగ్‌ చూసిన తర్వాత.. అతడ్ని కూడా బ్యాటింగ్ ఆర్డర్‌లో కొంచెం ముందుకు పంపడంపై కూడా టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే చర్చించిందట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.