యాప్నగరం

ధోనీ గొప్పదనాన్ని గుర్తుకు తెచ్చిన కోహ్లి

రహానేతో కలిసి ట్రోఫీని అందుకున్న విరాట్ క ోహ్లి మాజీ కెప్టెన్ ధోనీని గుర్తుకు తెచ్చాడు.

TNN 28 Mar 2017, 2:52 pm
ధర్మశాల టెస్టులో విజయం సాధించడం ద్వారా 2-1 తేడాతో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించగా.. మూడో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ విరాట్ గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో అజింక్య రహానే జట్టును ముందుకు నడిపించాడు. భుజానికైన గాయం తగ్గకపోవడంతో చివరి టెస్టుకు కోహ్లి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో రహానే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
Samayam Telugu kohli and rahne remember ms dhoni anil kumble lifting the border gavaskar trophy together in 2008
ధోనీ గొప్పదనాన్ని గుర్తుకు తెచ్చిన కోహ్లి


తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. రెండో టెస్టులో కోహ్లి నాయకత్వంలోని భారత్ గెలుపొందిందింది. దీంతో 1-1తో సిరీస్ సమమైంది. మూడో టెస్టు డ్రాగా ముగియడంతో ధర్మశాల టెస్టు కీలకమైంది. ఈ మ్యాచ్‌లో రహానే జట్టును గెలిపించాడు. దీంతో విజేతకు ట్రోఫీని అందించే సమయంలో విరాట్, రహానే ఇద్దరూ కలిసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అందుకున్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది.

2008లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టుకు అనిల్ కుంబ్లే నాయకత్వం వహించాడు. బెంగళూరులో జరిగిన ఆ టెస్ట్ డ్రాగా ముగిసింది. కానీ భుజానికి గాయం కావడంతో అచ్చం విరాట్‌లాగే కుంబ్లే కూడా మొహాలీలో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. మూడో టెస్టులో మళ్లీ కెప్టెన్‌గా ఆడినప్పటికీ వేలికి గాయమై 11 కుట్లు పడటంతో అనూహ్యంగా కుంబ్లే రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో చివరి టెస్టుకు మళ్లీ ధోనీనే కెప్టెన్‌గా వ్యవహరించాడు. కుంబ్లే కెప్టెన్‌గా వ్యవహరించిన రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగియగా.. ధోనీ నాయకత్వంలో జరిగిన రెండు టెస్టులను భారత్ గెలుచుకుంది. దీంతో ట్రోఫీని అందుకునే సమయంలో కుంబ్లేను ఆహ్వానించిన ధోనీ.. జంబోతో కలిసి ట్రోఫీని స్వీకరించాడు.

నాగ్‌పూర్‌లో జరిగిన నాలుగో టెస్టు గంగూలీ కెరీర్లో చివరిది కావడంతో మ్యాచ్ ముగిసే ముందు కాసేపు దాదాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన ధోనీ సీనియర్లకు సముచిత గౌరవం ఇచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.