యాప్నగరం

Virat Kohli మరీ అతి చేస్తున్నాడు: హస్సీ

మైదానంలో విరాట్ కోహ్లీ పూర్తిగా నియంత్రణ కోల్పోయాడు. అతని వ్యవహారశైలి నాకు ఏమాత్రం నచ్చడం లేదు - మైకేల్ హస్సీ

Samayam Telugu 17 Dec 2018, 9:26 am
Samayam Telugu 0
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడని ఆ దేశ మాజీ క్రికెటర్లు మైకేల్ హస్సీ, బోర్డర్ మండిపడ్డారు. పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మైదానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌పై స్లెడ్జింగ్‌కి దిగడం, ఔటైనప్పుడు అతిగా సంబరాలు చేసుకోవడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.

శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకి ఆలౌటవగా.. విరాట్ కోహ్లి (123: 257 బంతుల్లో 13x4, 1x6) శతకం బాదడంతో భారత్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులతో బదులిచ్చింది. కెరీర్‌లో కోహ్లీకి ఇది 25వ టెస్టు శతకంకాగా.. ఆస్ట్రేలియా గడ్డపై ఆరోది కావడం విశేషం.

‘మైదానంలో విరాట్ కోహ్లీ పూర్తిగా నియంత్రణ కోల్పోయాడు. అతని వ్యవహారశైలి నాకు ఏమాత్రం నచ్చడం లేదు’ అని మైకేల్ హస్సీ విమర్శించాడు. ‘ఇలా ఆన్‌ ఫీల్డ్‌లో అతిగా ప్రవర్తించే కెప్టెన్‌ని నేను ఇంత వరకూ చూడలేదు’ అని బోర్డర్ మండిపడ్డాడు.

ఆదివారం ఆట ముగిసిన తర్వాత పెవిలియన్‌కి వెళ్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్‌‌తో మాటల యుద్ధానికి దిగిన విరాట్ కోహ్లీ.. కవ్వించే తరహాలో మాట్లాడిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అంతకముందు కూడా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ కోహ్లీ అతడిపై స్లెడ్జింగ్‌కి దిగడం కనిపించింది. సాధారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇలా స్లెడ్జింగ్‌కి దిగుతుంటారు. కానీ.. ఓ ప్రత్యర్థి కెప్టెన్ వారిపైనే ఇలా కవ్వింపులకి దిగడాన్ని హస్సీ, బోర్డర్ జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.