యాప్నగరం

అలా అవుటైన రెండో భారత కెప్టెన్ కోహ్లి

రాజ్‌కోట్ టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చేజేతులా ఇంగ్లండ్ బౌలర్ రషీద్‌కు వికెట్ ఇచ్చేశాడు. హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు.

TNN 12 Nov 2016, 12:18 pm
రాజ్‌కోట్ టెస్టులో నాలుగో రోజు లంచ్ విరామ సమయానికి భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. అశ్విన్, సాహా చెరో 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 319/4గా ఉన్న సంగతి తెలిసిందే. రహానే 13 పరుగుల వద్ద అవుట్ కాగా, 40 పరుగులు చేసిన కోహ్లి హిట్ ది వికెట్ రూపంలో వెనుదిరిగాడు. రషీద్ వేసిన బంతిని ఎదుర్కొనే క్రమంలో విరాట్ హిట్ వికెట్‌గా అవుటయ్యాడు. 120వ ఓవర్ మూడో బంతిని హిట్ చేసి రన్ కోసం పరుగెడుతున్న క్రమంలో కోహ్లి కాలు వికెట్లను తాకింది. దీంతో బెయిల్స్ కింద పడ్డాయి. ఈ విషయం గమనించిన ఇంగ్లిష్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా, థర్డ్ అంపైర్ అవుటిచ్చాడు.
Samayam Telugu kohli is the second indian captain getting hit wicket out in test matches
అలా అవుటైన రెండో భారత కెప్టెన్ కోహ్లి



టెస్టుల్లో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన రెండో భారత కెప్టెన్ కోహ్లినే కావడం గమనార్హం. ఇంతకు ముందు 1949లో లాలా అమర్‌నాథ్ వెస్టిండీస్‌పై హిట్ వికెట్‌గా అవుటయ్యాడు. కోహ్లిని కలుపుకొని ఇప్పటి వరకూ 22 మంది భారత ఆటగాళ్లు ఈ తరహాలో అవుటయ్యారు. హిట్ వికెట్‌గా అవుటైన చివరి ఇండియన్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్. 2002లో వీవీఎస్ విండీస్‌పై హిట్ ద వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అలా వికెట్‌ను ప్రత్యర్థికి అప్పగిచ్చేసిన భారత బ్యాట్స్‌మెన్ కోహ్లినే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.