యాప్నగరం

విరాట్ కోహ్లి మరోసారి నిరూపించాడు..!

భారత్, ఆస్ట్రేలియా మధ్య ధర్మశాల వేదికగా గత ఏడాది మార్చిలో రసవత్తరంగా టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్‌తోనే

TNN 26 Feb 2018, 4:11 pm
భారత్, ఆస్ట్రేలియా మధ్య ధర్మశాల వేదికగా గత ఏడాది మార్చిలో రసవత్తరంగా టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్‌తోనే టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన కుల్దీప్ యాదవ్ వికెట్ పడగొట్టగానే.. డగౌట్‌ నుంచి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వాటర్ బాటిల్స్ తీసుకుని మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసి.. మ్యాచ్ కామెంటేటర్లలతో పాటు, సహచర క్రికెటర్లు, అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆ మ్యాచ్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన రవిశాస్త్రి స్టైల్‌లో చెప్పాలంటే.. ‘మోస్ట్ కాస్ట్‌లీ వాటర్‌ బాయ్’.. అంతర్జాతీయ క్రికెట్‌లో 10వేల పరుగులు చేసి.. నీళ్లసీసాలు మోసిన ఏకైక క్రికెటర్ అంటూ.. చెప్పుకొచ్చాడు. భుజం గాయం కారణంగా కోహ్లి ఆ మ్యాచ్‌లో ఆడలేదు. ఏ హోదాలో ఉన్నా.. జట్టులోని సహచరులకి సాయం చేయడంలో తనకి ఎలాంటి భేషజాలు లేవని అప్పట్లో కోహ్లి నిరూపించాడు.
Samayam Telugu kohli turns masseur for shikhar dhawan in cape town
విరాట్ కోహ్లి మరోసారి నిరూపించాడు..!


దక్షిణాఫ్రికాతో శనివారం రాత్రి ముగిసిన చివరి టీ20 మ్యాచ్‌లో వెన్నునొప్పి కారణంగా తుది జట్టుకి దూరమైన కెప్టెన్ కోహ్లి.. పెవిలియన్‌ నుంచి మ్యాచ్‌ని చూస్తూ కనిపించాడు. ఈ మ్యాచ్‌లో 47 పరుగులు చేసి పేలవ రీతిలో రనౌటైన ఓపెనర్ శిఖర్ ధావన్.. తీవ్ర ఒత్తిడి మధ్య పెవిలియన్‌కి చేరాడు. దీంతో.. ఓపెనర్ నలతని గమనించిన విరాట్ కోహ్లి అతని వెనక్కి చేరి.. తలని కాసేపు మర్దన చేస్తూ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొంది.. విజయంతో పర్యటనని ముగించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.