యాప్నగరం

అలాగైతే తప్ప.. క్రికెట్ ఆడకుండా కోహ్లి క్షణమైనా ఉండలేడు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి ఫీల్డింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లికి ఆత్మగౌరవం చొక్కలాంటిదని..

TNN 17 Nov 2017, 6:59 pm
శరీరం సహకరించినంత వరకూ దేశం తరఫున ప్రతి మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లి ఆడతాడని భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తెలిపాడు. శరీరం డిమాండ్ చేస్తేనే అతడు విశ్రాంతి తీసుకుంటాడని స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది ఆరంభంలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుతం రెండు నెలలపాటు సొంత గడ్డ మీద శ్రీలంకతో క్రికెట్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో శ్రీధర్ కోహ్లి గురించి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో శరీరానికి విశ్రాంతి అవసరం అనుకుంటేనే రెస్ట్ తీసుకుంటానని విరాట్ కోహ్లి చెప్పిన సంగతి తెలిసిందే.
Samayam Telugu kohli wont miss a chance to play till his body allows sridhar
అలాగైతే తప్ప.. క్రికెట్ ఆడకుండా కోహ్లి క్షణమైనా ఉండలేడు


‘దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ప్రతి ఆటగాడు గర్వంగా ఫీలవుతున్నాడు. జట్టులోని చాలా మంది ప్రతి మ్యాచ్ ఆడాలని భావిస్తున్నారు. ఆత్మగౌరవాన్ని ఒంటి మీద చొక్కలా ధరించిన విరాట్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. అతడి శరీరం సహకరిస్తే.. ఒక్క క్షణం కూడా క్రికెట్ ఆడకుండా కోహ్లి ఉండలేడ’ని ఫీల్డింగ్ కోచ్ తెలిపాడు.

క్రీజులో గడిపిన సమయం, బౌలింగ్ వేసిన ఓవర్లు, బ్యాటింగ్ తదితర అంశాల ఆధారంగా, పనిభారాన్ని బట్టే హార్దిక్ పాండ్యకు విశ్రాంతి ఇచ్చామని తెలిపాడు. భారత జట్టు ఫీల్డింగ్ ఎంతో బాగుందని చెప్పాడు. సురేశ్ రైనా అద్భుతమైన ఫీల్డర్ అని ఫిట్‌నెస్ టెస్టులో పాసయితే.. తప్పకుండా భారత్ తరఫున ఆడతాడని శ్రీధర్ తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.