యాప్నగరం

రికీ పాంటింగ్ కసి ఇప్పుడు కోహ్లిలో..?

భారత కెప్టెన్ విరాట్ కోహ్లిలోని బలమైన గెలుపు కాంక్ష తనని అమితంగా ఆకట్టుకుంటోందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ

TNN 16 Aug 2017, 11:17 am
భారత కెప్టెన్ విరాట్ కోహ్లిలోని బలమైన గెలుపు కాంక్ష తనని అమితంగా ఆకట్టుకుంటోందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ వెల్లడించాడు. ఒకప్పుడు రికీ పాంటింగ్‌లో ఈ కాంక్ష ఉండేదని.. ఇప్పుడు కోహ్లిలో అంతకంటే ఎక్కువే ఉందని అతను అభిప్రాయపడ్డాడు. త్వరలో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత్‌కి వస్తుండటంతో ఈ సిరీస్ చాలా రసవత్తరంగా సాగుతుందని హస్సీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Samayam Telugu kohlis aggressive captaincy similar to ponting
రికీ పాంటింగ్ కసి ఇప్పుడు కోహ్లిలో..?


‘విరాట్ కోహ్లి చాలా తెలివైన ఆటగాడు. అతని కెప్టెన్సీ నాకు బాగా నచ్చుతోంది. దూకుడుగా ఆడుతూ.. గెలవాలనే అతని కాంక్ష నాకు ఇంకా ఇష్టం. బలీయమైన అతని కోరికే.. జట్టును విజయాల బాట పట్టిస్తోంది. ఫిటెనెస్ పరంగా.. మ్యాచ్‌ల్లోనూ అతను ఒక అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడు. ఇదే తరహా లక్షణాలు నేను ఒకప్పుడు రికీ పాంటింగ్‌లో చూశాను. ఇద్దరిదీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చాటాలనే నైజమే’ అని హస్సీ వివరించాడు. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్‌ని భారత్ 2-1తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.