యాప్నగరం

టెస్టుల్లో కుల్దీప్‌‌‌కి ఛాన్స్ ఇవ్వొచ్చు: కోహ్లి

ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1నుంచి జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌ కోసం కుల్దీప్ యాదవ్‌ను భారత జట్టులోకి సెలక్టర్లు ఎంపిక చేయొచ్చని కెప్టెన్

Samayam Telugu 13 Jul 2018, 1:17 pm
ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1నుంచి జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌ కోసం కుల్దీప్ యాదవ్‌ను భారత జట్టులోకి సెలక్టర్లు ఎంపిక చేయొచ్చని కెప్టెన్ విరాట్ కోహ్లి ఆశాభావం వ్యక్తం చేశాడు. గురువారం రాత్రి ఇంగ్లాండ్‌తో ముగిసిన తొలి వన్డేలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్ 25 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లను పడగొట్టాడు. అతని మణికట్టు స్పిన్ బౌలింగ్‌లో ఆడలేక బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 268 పరుగులకి ఆలౌటైంది. అనంతరం లక్ష్యాన్ని భారత జట్టు రోహిత్ శర్మ (137 నాటౌట్) అజేయ శతకం బాదడంతో 40.1 ఓవర్లలోనే 269/2తో ఛేదించేసింది.
Samayam Telugu ..


టీ20, వన్డే జట్టులో గత ఏడాదికాలంగా కుల్దీప్ యాదవ్ కొనసాగుతున్నా.. టెస్టుల్లో మాత్రం అతనికి తగినన్ని అవకాశాలు దక్కడం లేదు. సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా‌లు టెస్టుల్లో మెరుగ్గా రాణిస్తుండటమే దీనికి కారణంగా. అయితే.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ కోసం అతడ్ని సెలక్టర్లు ఎంపిక చేయొచ్చని కోహ్లి వెల్లడించాడు.

‘టెస్టు సిరీస్‌ కోసం ప్రకటించే జట్టులో ఆశ్చర్యకరమైన మార్పులు ఉండే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్, చాహల్ టెస్టు జట్టుకి గట్టి పోటీదారులే. ఈ మణికట్టు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. కాబట్టి.. సెలక్టర్లు కూడా వారి ఎంపికని పక్కన పెట్టకపోవచ్చు’ అని విరాట్ కోహ్లి వెల్లడించాడు. భారత జట్టు ఐదు టెస్టులను ఇంగ్లాండ్‌తో ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.