యాప్నగరం

టెస్టుల్లో ఇలా కూడా రనౌటవుతారా..?

బంతిని ఫీల్డర్ చేతిలో పెట్టుకుని లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ రనౌటై అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

TNN 13 Aug 2017, 7:12 pm
ఐదు రోజుల టెస్టు ఫార్మాట్‌లో బంతి బౌండరీ లైన్ దగ్గరికి వెళ్లినా.. సాధారణంగా బ్యాట్స్‌మెన్ ఒక పరుగుతోనే సరిపెట్టుకుంటూ ఉంటారు. అలాంటిది భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక బ్యాట్స్‌మెన్ మెండిస్ బంతిని ఫీల్డర్ చేతిలో పెట్టుకుని లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ రనౌటై అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ రనౌట్‌లో కూడా అతనికి ఒక ఛాన్స్ వచ్చినా.. వేగంగా స్పందించలేకపోవడం కొసమెరుపు.
Samayam Telugu kuldeep yadav gets kusal mendis run out after
టెస్టుల్లో ఇలా కూడా రనౌటవుతారా..?


శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 38/2తో నిలిచిన దశలో మహ్మద్ షమీ బౌలింగ్‌లో బంతిని కెప్టెన్ దినేశ్ చండిమాల్ మిడ్‌వికెట్ దిశగా తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే.. మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ డైవ్ చేస్తూ బంతిని అడ్డుకున్నాడు. అప్పటికే పరుగు కోసం మరో ఎండ్‌లో ఉన్న మెండిస్ క్రీజు వదిలి ముందుకు వెళ్లిపోవడంతో వెంటనే అశ్విన్ రనౌట్ కోసం బంతిని బౌలర్ షమీకి అందించాడు. కానీ.. అతను బంతిని అందుకోలేకపోయాడు. దీంతో బంతి షమీని దాటుకుంటూ సిల్లీ పాయింట్‌లో ఉన్న కుల్దీప్ చేతుల్లోకి వెళ్లింది. ఈ బంతి దోబూచులాటతో ఆందోళన చెందిన చండిమాల్ వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా మెండిస్‌కి సూచించాడు. అతను వేగంగా వెనక్కి వచ్చినా.. అప్పటికే బంతిని అందుకున్న కుల్దీప్ డైరెక్ట్ త్రోతో బెయిల్స్‌ని పడగొట్టేశాడు. ఈ రనౌట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

pic.twitter.com/m3M0kn3RB5 — Cricvids (@Cricvids1) August 13, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.