యాప్నగరం

కుల్దీప్ భారత నెం.1 స్పిన్నర్ అవుతాడు: భజ్జీ

కుల్దీప్ యాదవ్ నిలకడగా రాణించడంతో దాదాపు ఏడాదికిపైగా ఎడమచేతి వాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా వన్డే, టీ20లకి దూరంగా ఉండాల్సిన వచ్చిన విషయం తెలిసిందే.

Samayam Telugu 7 Dec 2022, 3:45 pm
మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. ఎప్పటికైనా భారత నెం.1 స్పిన్నర్‌ అవుతాడని సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (భజ్జీ) జోస్యం చెప్పాడు. గత ఏడాదికాలంగా వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లోనూ నిలకడగా రాణిస్తున్న కుల్దీప్ యాదవ్.. 2019 ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లోనూ అతను 10 వికెట్లతో సత్తాచాటాడు. ఆదివారం నుంచి ఐదు వన్డేల సిరీస్ మొదలవనుండగా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ గురించి హర్భజన్ సింగ్ మీడియాతో మాట్లాడాడు.
Samayam Telugu Kuldeep Yadav


‘కుల్దీప్ యాదవ్ తన మణికట్టుతో బంతిని రెండు వైపులా తిప్పగలడు. అంతేకాకుండా.. బంతిని ఎక్కువ సేపు గాల్లో ఉంచి బ్యాట్స్‌మెన్‌‌ని తికమక పెట్టించి బోల్తా కొట్టించగలడు. అతని జోరు ఇలానే కొనసాగితే మ్యాచ్‌ని శాసించే స్థితికి చేరుకుంటాడు. కచ్చితంగా భవిష్యత్‌లో అతను భారత్ నెం.1 స్పిన్నర్‌గా ఎదుగుతాడు’ అని హర్భజన్ సింగ్ ప్రశంసించాడు.

కుల్దీప్ యాదవ్ నిలకడగా రాణించడంతో దాదాపు ఏడాదికిపైగా ఎడమచేతి వాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా వన్డే, టీ20లకి దూరంగా ఉండాల్సిన వచ్చిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.