యాప్నగరం

Virender Sehwag: ‘రూ.10 కోట్ల చీర్ లీడర్’.. ఎద్దేవా చేసిన వీరూకి మ్యాక్స్‌వెల్ చురకలు

ఐపీఎల్ 2020లో పేలవ ఆటతీరును కనబర్చిన మ్యాక్స్‌వెల్‌ను వీరేంద్ర సెహ్వాగ్ రూ.10 కోట్ల చీర్ లీడర్ అని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. వీరూ వ్యాఖ్యల పట్ల మ్యాక్స్‌వెల్ స్పందించాడు.

Samayam Telugu 20 Nov 2020, 5:34 pm
ఐపీఎల్ 2020లో పేలవ ప్రదర్శన చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌‌ను రూ.10 కోట్ల చీర్ లీడర్ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ఎద్దేవా చేసిన సంగతి తెలిసింది. మ్యాక్సీని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.10.5 కోట్లకు కొనుగోలు చేయగా.. ఐపీఎల్ 2020లో అతడు కేవలం 108 రన్స్ మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. పంజాబ్‌కు భారంగా మారిన ఆటగాళ్లలో మ్యాక్సీ ముందు నిలిచాడు. దీంతో పది కోట్ల చీర్ లీడర్, భారీ మొత్తంలో డబ్బు తీసుకొని వెకేషన్‌కు వచ్చాడంటూ వీరు విమర్శలు గుప్పించాడు.
Samayam Telugu maxwell-sehwag
Image: IPL/BCCI


గతంలో పంజాబ్ మెంటార్‌గా పని చేసిన సెహ్వాగ్ కామెంట్ల విషయమై మ్యాక్స్‌వెల్ స్పందించాడు. వీరూ కామెంట్లు తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని చెప్పిన మ్యాక్సీ.. అతడిలా కామెంట్ చేయడం ఇదే తొలిసారి కాదన్నాడు. ‘‘నా గురించి తన అయిష్టతను వీరూ బయటపెట్టాడు. అందులో ఇబ్బందేం లేదు. తనకు నచ్చినట్లు అతడు మాట్లాడొచ్చు. అలాంటి స్టేట్‌మెంట్ల వల్లే అతడు మీడియాలో ఉన్నాడు. కాబట్టి అందులో ఇబ్బందేం లేదు’’ అని మ్యాక్సీ తెలిపాడు. ఈ ఏడాది తనకు కఠిన పరీక్షా సమయమని చెప్పుకొచ్చాడు.

ఈ టోర్నీలో మ్యాక్సీ ఆటతీరు పేలవంగా ఉంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్ కొడితే పంజాబ్ గెలుస్తుందనగా.. మ్యాక్స్‌వెల్ ఫోర్ మాత్రమే బాదాడు. బంతి బౌండరీ లైన్‌కు కొద్ది అంగుళాల దూరంలో నేలను తాకడంతో.. మ్యాచ్ పంజాబ్ చేజారింది. ఈ సీజన్లో మ్యాక్సీ ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. 2017 ఐపీఎల్‌లో 26 సిక్సులు బాదిన మ్యాక్సీ.. ఈ సీజన్లో ఇంత పేలవంగా ఆడటం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

కోల్‌కతాతో మ్యాచ్‌లో చివరి బంతికి సిక్స్ కొట్టలేకపోయిన విషయమై మ్యాక్సీ స్పందిస్తూ.. ఆ మ్యాచ్‌కు ముందు తాను మరికొన్ని సార్లు జిమ్‌కు వెళ్లాల్సిందన్నాడు. మ్యాక్స్‌వెల్ గతంలో ఐపీఎల్‌ రెండు సీజన్లలో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.