యాప్నగరం

కోతి మాట.. మలింగపై ఏడాది నిషేధం..!

భారత్ జట్టు శ్రీలంకలో పర్యటించనున్న నేపథ్యంలో మలింగ శిక్షను ఆరు నెలల పాటు సస్పెన్షన్‌లో ఉంచనుంది.

TNN 28 Jun 2017, 3:44 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంక పేలవ ప్రదర్శనపై విమర్శించిన ఆ దేశ క్రీడల మంత్రిని కోతితో పోల్చినందుకు ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగపై ఏడాది పాటు నిషేధం వేటు పడింది. ఫిటెనెస్ లేకపోవడంతో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోయిందని క్రీడల మంత్రి దయాసిరి జయశేఖర పెదవి విరిచారు. దీనిపై ఘాటుగా స్పందించిన మలింగ ‘చిలుకలు చెట్టు తొర్రలో ఏర్పాటు చేసుకున్న గూటిలోకి కోతి వచ్చి మాట్లాడినట్లుంది’ అని వివాదాస్పద రీతిలో మాట్లాడాడు.
Samayam Telugu lasith malinga gets a suspended one year ban
కోతి మాట.. మలింగపై ఏడాది నిషేధం..!


మలింగ మాటలపై విచారణకి ఆదేశించిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. అతనిది తప్పు అని తేలడంతో ఏడాది పాటు నిషేధం విధించింది. అంతేకాకుండా తొలి వన్డే మ్యాచ్‌ ఫీజులో కూడా 50 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. మరికొద్ది రోజుల్లోనే జింబాబ్వే జట్టుతో శ్రీలంక సొంతగడ్డపై సిరీస్ ఆడనుంది. అనంతరం భారత్ జట్టు శ్రీలంకలో పర్యటించనున్న నేపథ్యంలో మలింగ శిక్షను ఆరు నెలల పాటు సస్పెన్షన్‌లో ఉంచనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.