యాప్నగరం

యార్కర్ల మలింగ మళ్లీ ఐపీఎల్‌లోకి..!

బెంగళూరు వేదికగా గత జనవరిలో జరిగిన ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో అమ్ముడుపోని క్రికెటర్‌గా నిలిచిన యార్కర్ల స్టార్

TNN 8 Feb 2018, 12:09 pm
బెంగళూరు వేదికగా గత జనవరిలో జరిగిన ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో అమ్ముడుపోని క్రికెటర్‌గా నిలిచిన యార్కర్ల స్టార్ లసిత్ మలింగ మళ్లీ ఐపీఎల్‌లోకి రానున్నాడు. అతడ్ని ముంబయి ఇండియన్స్ బౌలింగ్‌ మెంటార్‌గా నియమిస్తూ ఆ జట్టు ఫ్రాంఛైజీ తాజాగా నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలం ముంబయి ఇండియన్స్ తరఫున ఐపీఎల్ ఆడిన మలింగ.. 110 మ్యాచ్‌ల్లో 154 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో అతని బౌలింగ్ బెస్ట్ 5/13. అయితే.. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత శ్రీలంక క్రీడల మంత్రిని తూలనాడిన మలింగ జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటి నుంచి ఫిటెనెస్, ఫామ్ అంటూ సెలక్టర్లు అతనికి మొండిచేయి చూపిస్తున్నారు.
Samayam Telugu lasith malinga to mentor mumbai indians bowlers in ipl
యార్కర్ల మలింగ మళ్లీ ఐపీఎల్‌లోకి..!


శ్రీలంక తరఫున ఆడలేకపోయినా.. కనీసం ఐపీఎల్‌లోనైనా ఆడుదామని ఆశించిన మలింగకి వేలంలో చుక్కెదురైంది. ముంబయి ఇండియన్స్‌తో పాటు టోర్నీలోని ఏడు ఫ్రాంఛైజీలు సైతం ఈ యార్కర్ల స్టార్‌ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో చేరిన ఈ ఫాస్ట్‌ బౌలర్‌కు ఎట్టకేలకి మళ్లీ ముంబయి ఫ్రాంఛైజీనే అవకాశం కల్పించింది. ఇటీవల మీడియాతో మలింగ మాట్లాడుతూ.. ‘నాలో ఇంకా క్రికెట్ మిగిలి ఉంది. ఆటగాడిగా కాకపోయినా బౌలింగ్‌ కోచ్‌గా ఉండమని ఏవరైనా అడిగితే సంతోషంగా ఒప్పుకుంటా’ అని ప్రకటించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.